‘పల్లెప్రగతి’తో మారిన పల్లెల రూపురేఖలు

ABN , First Publish Date - 2022-05-15T05:30:00+05:30 IST

‘పల్లెప్రగతి’తో మారిన పల్లెల రూపురేఖలు

‘పల్లెప్రగతి’తో మారిన పల్లెల రూపురేఖలు
గుంతబాస్పల్లిలో రోడ్డు పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు రూరల్‌, మే 15 : పల్లెప్రగతి కార్యక్రమంతో పల్లెల రూపు రేఖలే మారిపోయాయని తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాండూరు మండల పరిధిలోని మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, ఐనెల్లి, కోటబాస్పల్లి, కొత్లాపూర్‌, మల్కాపూర్‌, జినుగుర్తి గ్రామాల్లో రూ.కోటీ 28లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు రైతులు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడమే సీఎం సంకల్పమని, ప్రభుత్వం ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం చేస్తుందన్నారు. మన ఊరు-మన బడి కింద రూ.7,300 కోట్లు వెచ్చించి ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంగ్లీష్‌ మీడియం తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్‌ అని రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతును రాజును చేసేందుకే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సాయిరెడ్డి(నరేందర్‌రెడ్డి), వైస్‌ ఎంపీపీ స్వరూపారాణి, సర్పంచ్‌లు నరేందర్‌రెడ్డి, రాజప్పగౌడ్‌, జగదీష్‌, స్వప్న, చంద్రశేఖర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌లు గోవింద్‌, ఖైరత్‌అలీ, వెంకటే్‌షగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మహిళా నాయకురాలు శకుంతల, టీఆర్‌ఎ్‌సవీ అధ్యక్షుడు గోపాల్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ భీంరెడ్డి, మల్లప్ప,  టీఆర్‌ఎస్‌ నాయకులు ఉమాశేఖర్‌, ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-15T05:30:00+05:30 IST