హిందూ సమాజంపై దాడి హేయం

ABN , First Publish Date - 2021-10-24T06:12:06+05:30 IST

బంగ్లాదేశలో హిందూ సమాజంపై దాడి హేయడం హేయమైన చర్య అని ఇస్కాన మంది రాల చైర్మన దామోదర్‌ గౌరంగదాస్‌ పేర్కొన్నారు.

హిందూ సమాజంపై దాడి హేయం
నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న ఇస్కాన బృందం, భక్తులు


: ఇస్కాన మందిరాల చైర్మన దామోదర్‌ గౌరంగదాస్‌

అనంతపురం టౌన, అక్టోబరు 23 : బంగ్లాదేశలో హిందూ సమాజంపై దాడి హేయడం హేయమైన చర్య అని ఇస్కాన మంది రాల చైర్మన దామోదర్‌ గౌరంగదాస్‌ పేర్కొన్నారు. దాడిని నిరసిస్తూ ఇస్కాన మందిరం ఆధ్వ ర్యంలో శనివారం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరే ట్‌లో బీ సెక్షన సూపరింటెండెంట్‌ శ్రీధర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దామోదర్‌ గౌరంగదాస్‌ మాట్లాడుతూ... ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు బంగ్లాదేశలోని నౌఖలిలో ఇస్కాన దేవాలయంతో పాటు హిం దూ సంఘాలపై కొందరు సంఘ విద్రోహులు దాడికి పాల్పడ్డార న్నారు. ఇస్కాన మందిర భాగాలతో పాటు ఆలయంలో దేవతా విగ్ర హాలను సైతం కూల్చారని తెలిపారు. ఇస్కానకు చెందిన కొందరు భక్తులను పదునైన ఆయుధాలతో దారుణంగా హత్య చేశారని, మరి కొందరిని తీవ్రంగా గాయపరిచారన్నారు. మందిరానికి సమీపంలో దా దాపు 150 ఇళ్లల్లోకి చొరబడి దోచు కోవడంతో పాటు ఇళ్లను ధ్వంసం చేశారన్నారు. హిందువులపై, దేవాలయా లపై జరుగుతున్న ఇలాంటి అనాగరిక చర్యలను అరికట్టేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఇస్కాన గోశాల ఇనచార్జి సుదర్శన పద్మనాభదాస్‌, ఆలయ కమిటీ సభ్యుడు శ్రీహరి శ్యామసుందర్‌రాజ్‌, ఇస్కాన మధ్యాహ్న భోజనం సూపర్‌వైజర్‌ హయ గ్రీవదాస్‌, భక్తరాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-24T06:12:06+05:30 IST