ప్రభుత్వ వైఖరి సరికాదు

ABN , First Publish Date - 2021-12-08T05:40:04+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఆర్‌సీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదని ఏపీ ఎనజీవోస్‌ ఆదోని అధ్యక్షుడు, జేఏసీ చైర్మన రమే్‌షరెడ్డి అన్నారు.

ప్రభుత్వ వైఖరి సరికాదు
ఆలూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు

ఏపీ ఎన్జీవో నాయకులు, ఉద్యోగుల నిరసన


ఆదోని(అగ్రికల్చర్‌), డిసెంబరు 7: ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఆర్‌సీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదని ఏపీ ఎనజీవోస్‌ ఆదోని అధ్యక్షుడు, జేఏసీ చైర్మన రమే్‌షరెడ్డి అన్నారు. జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద, పాఠశాలల వద్ద ఉపాధ్యాయులు, ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తుంగభద్ర దిగువ కాలువ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయం, సబ్‌ ట్రెజరీ, కమర్షియల్‌ ట్యాక్స్‌, పశుసంవర్థక శాఖ, ఈఎ్‌సఐ కార్యాలయం, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇన్నేళ్లు పీఆర్‌సీ జాప్యం ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను సీఎం జగన నెరవేర్చలేదని అన్నారు. పీఆర్‌సీ నివేదికను వెంటనే ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన విధానాన్ని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన ఆదోని అధ్యక్షుడు రజనీకాంతరెడ్డి, ఏపీ ఎన్జీవోస్‌ ఆదోని కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, పెన్షనర్స్‌ అసోసియేషన ఆదోని అధ్యక్షుడు యాసిన, ఉద్యోగులు ఉషారాణి, పెద్దయ్య, రమేష్‌ పాల్గొన్నారు. 

ఉద్యోగుల నిరసన

ఆలూరు, డిసెంబరు 7: డీఏ బకాయిలు మంజూరు చేయాలని, పీఆర్‌సీను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ఎనజీవో సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఎనజీవో తాలుకా కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు అడిగిన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శేఖర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఆర్‌ఐ గుండాల నాయక్‌, దిల్‌నవాజ్‌బేగం, యూటీఎఫ్‌ నాయకుడు మురళి పాల్గొన్నారు. 

ఎమ్మిగనూరు: పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు, డీఏలు విడుదల చేయకపోవడం పట్ల ప్రభుత్వ మెండి వైఖరిని నిరసిస్తూ ఏపీజేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ పిలుపు మేరకు మంగళవారం ఎమ్మిగనూరులో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వం మొండివైఖరి వీడాలంటు నినాదాలు చేశారు. కార్యక్రమంలో తాలుక అధ్యక్షుడు మద్దిలేటి, నాయకులు ప్రభు, బజారి, బడేసాబు, హుసేనయ్య పాల్గొన్నారు.  

ఎమ్మిగనూరు టౌన్‌: బనవాసి ఘనీకృత వీర్య ఆబోతు కేంద్రం ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ శ్రీధర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు, అనిల్‌ కిరణ్‌, వీరేష్‌, సీతమ్మ, జూనియర్‌ అసిస్టెంట్‌ సురేష్‌ పాల్గొన్నారు. 

ఫ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కరెకృష్ణ డిమాండ్‌ చేశారు. గుడేకల్లు ఉన్నత పాఠశాల వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసప్ప, మహేష్‌, సురేష్‌, బసన్న, లలితాకుమారి, జ్యోతి పాల్గొన్నారు.

ఫ ఉపాఽధ్యాయ, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు ఏపీ ఈరన్న డిమాండ్‌ చేశారు. కార్యాలయం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు శ్రీనివాసులు, సుందరీబాయి, కృష్ణయ్య, సుబ్బరాయుడు, గురువయ్య, నాగభూషణం పాల్గొన్నారు.

ఫ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్‌ ప్రసన్నరాజు, యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ నాగరాజు డిమాండ్‌ చేశారు. కడివెళ్ల ఉన్నత పాఠశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.   సురేష్‌, అన్నపూర్ణ, శ్రీదేవి, లక్ష్మీదేవి, వీణాకుమారి పాల్గొన్నారు. 

గోనెగండ్ల: ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాటం చేస్తామని జీడీపీ ఇరిగేషన ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసనలు తెలియజేశారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని, పీఆర్‌సీని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ లను మంజూరు చేయాలని కోరారు. ఇరిగేషన అధికారులు ఉగ్రనరసింహులు, మగ్బూల్‌ బాషా, సరసప్ప, యల్లప్ప, రంగడు, హనీఫ్‌, నరేష్‌, నవీన, రఘు, ఉపాధ్యాయ సంఘం నాయకులు రామన, చంద్రపాల్‌ , లింగన్న, పాల్గొన్నారు. 

కోసిగి: పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఏపీటీఎఫ్‌, డీటీఎఫ్‌, యూటీఎఫ్‌, ఎస్టీయూ, పీఆర్‌టీయూ నాయకులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ  విధానాలు అన్యాయంగా ఉన్నాయని నాయకులు గురుస్వామి, వెంకటరెడ్డి, గోరంట్ల చంద్రశేఖర్‌ అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు సుధాకర్‌, నాగరాజు, ఎర్రిస్వామి, రామాంజులు, గౌడు, రాజారత్నం, నాగవేణి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-08T05:40:04+05:30 IST