Advertisement

ఇవి వచ్చేస్తున్నాయి చూడండి...

Jan 24 2021 @ 01:22AM

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు... కొత్త సినిమాల కోసం మాత్రమే కాదు.. తమను అమితంగా ఆకట్టుకుంటున్న ఓటీటీ వెబ్‌ సిరీ్‌సల కోసం కూడా. కొత్త సినిమాల విడుదల కోసం ఎదురుచూసినట్టు ఓటీటీలో కొత్తగా వచ్చే వెబ్‌సిరీ్‌సలు, కొత్త సీజన్లు కోసం  ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఎప్పుడెప్పుడా అని ఈ ఏడాది ప్రేక్షకులను ఎదురుచూసేలా చేస్తోన్న కొన్ని హిందీ వెబ్‌ సిరీ్‌సలు ఇవే. 


మీర్జాపూర్‌ 3

ప్రేక్షకాదరణ పొందిన వెబ్‌సిరీ్‌సల్లో ‘మీర్జాపూర్‌’ ప్రముఖంగా నిలుస్తుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకులను అలరించిన ఈ క్రైమ్‌, డ్రామా వెబ్‌సిరీస్‌ రెండు సీజన్లు పూర్తిచేసుకొంది. మూడో సీజన్‌ కోసం సిద్ధమవుతోంది. రెండో సీజన్‌లో ఇచ్చిన ఆసక్తికర ముగింపు   ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచింది. ‘మీర్జాపూర్‌ 3’ కోసం ఎదురుచూసేలా చేసింది. ఈ ఏడాది చివరలో ‘మీర్జాపూర్‌ 3’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. 


ద ఫ్యామిలీమాన్‌ 2

త్యంత ఆదరణ పొందిన  వెబ్‌సిరీ్‌సల్లో ‘ద ఫ్యామిలీమాన్‌’ స్థానం ప్రత్యేకం. టీవీ సీరియళ్ల గురించి మాత్రమే తెలిసిన వాళ్లనూ వెబ్‌సిరీ్‌సల గురించీ మాట్లాడుకునేలా చేసింది. 2019 సెప్టెంబర్‌లో అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సిరీస్‌ ప్రతి ఎపిసోడ్‌ వీక్షకులను కట్టిపడేసింది. కరోనా వల్ల రెండో సీజన్‌ చిత్రీకరణ ఆలస్యం అయింది. ప్రేక్షకుల నిరీక్షణకు తెర దించుతూ ఫిబ్రవరి 12న ‘ఫ్యామిలీమాన్‌’ సీజన్‌ 2 విడుదలవుతోంది. ఇందులో తెలుగు కథానాయిక సమంత ప్రతినాయకి పాత్రలో కన్పించనుండడం విశేషం. 


కోటా ఫ్యాక్టరీ 2

టాప్‌ రేటింగ్‌ సాధించిన వెబ్‌సిరీస్‌ ‘కోటా ఫ్యాక్టరీ’. 2019 ఏప్రిల్‌లో ద వైరల్‌ ఫీవర్‌ యాప్‌, యూట్యూబ్‌లో విడుదలైంది. ఇండియాలో ఇదే తొలి బ్లాక్‌ అండ్‌ వైట్‌ వెబ్‌సిరీస్‌. ఇటార్సీ నుంచి కోటాకు వలస వచ్చిన వైభవ్‌ కష్టపడి ఐఐటీలో సీటు సాధించడం అనేది ప్రఽధానాంశం. ఈ ఏడాదిలోనే ఈ వెబ్‌సిరీ్‌సకు సీజన్‌ 2 విడుదల అవుతుందని నిర్మాణ సంస్థ ద వైరల్‌ ఫీవర్‌ ప్రకటించింది.


మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2

ఇండియాలో అత్యంత ఆడంబరంగా జరిగే వివాహ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ వ్యంగ్యాత్మకంగా రూపొందించిన వెబ్‌సిరీస్‌ ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌’. 2019లో అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. ఉత్తమ దేశీ వెబ్‌     సిరీ్‌సగా ప్రేక్షకుల గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం సీజన్‌2 నిర్మాణంలో ఉంది. జనవరిలోనే విడుదల చేయాలని భావించినా లాక్‌డౌన్‌తో చిత్రీకరణలో జాప్యం జరిగింది. ‘‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌ 2’ను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని దర్శకులు జోయా అక్తర్‌ చెప్పారు. 


ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ సీజన్‌ 3

డ్రగ్స్‌, రాజకీయాలు ఒక క్రికెట్‌ జట్టును ఎలా ప్రభావితం చేశాయనేది ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’  వెబ్‌సిరీస్‌ కథాంశం. క్రికెట్‌ నేపథ్యం కావడంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. మొదటి రెండు సీజన్‌లు సక్సెస్‌ అవ్వడంతో ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ వెబ్‌సిరీ్‌సకు మూడో సీజన్‌ను రూపొందిస్తున్నట్టు అమెజాన్‌ ప్రకటించింది. కానీ కరోనా వల్ల చిత్రీకరణ ఆలస్యం అయింది. త్వరలోనే ఈ వెబ్‌సిరీస్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. 


బాంబే బేగమ్స్‌

 భిన్న తరాలకు చెందిన ఐదుగురు మహిళలు పురుషాధిక్య సమాజంలో తమ అస్థిత్వాన్ని నిలుపుకోవడానికి ఎలాంటి పోరాటం చేశారనేది ‘బాంబే బేగమ్స్‌’ ప్రధానాంశం. నెట్‌ఫ్లిక్స్‌ నిర్మాణంలో ‘లిప్‌స్టిక్‌ అండర్‌ మై బుర్ఖా’ చిత్ర రచయిత అలంకృతా శ్రీ వాస్తవ దర్శకత్వం వహించడం, పూజాభట్‌ ప్రధాన పాత్ర పోషించడంతో ఈ వెబ్‌సిరీస్‌ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘బాంబే బేగమ్స్‌’ వెబ్‌సిరీస్‌ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తుంది. 


ఆర్య సీజన్‌ 2

డిస్నీ, హాట్‌స్టార్‌లో గతేడాది విడుదలైన ‘ఆర్య’ వెబ్‌సిరీస్‌ బెస్ట్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీ్‌సగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సుస్మితా సేన్‌ టైటిల్‌ రోల్‌ పోషించారు. కుటుంబ ం బాగోగులకే పరిమితమైన మహిళ అనుకోని పరిస్థితుల్లో కుటుంబ వ్యాపార పగ్గాలను చేపట్టడం, తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం చేసిన పోరాటం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ వెబ్‌సిరీ్‌సలో ముగ్గురు పిల్లల తల్లిగా సుస్మితాసేన్‌ నటన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఉత్తమ నటిగా ఆమె ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డ్‌ దక్కించుకున్నారు. మొదటి సీజన్‌ ఆకట్టుకోవడంతో ఈ ఏడాది రెండో సీజన్‌ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. 


హాస్టల్‌ డేజ్‌ 2

 ఇంజినీరింగ్‌ హాస్టల్‌లో స్నేహితులు, సరదాలు, ర్యాగింగ్‌ నేపథ్యంలో సాగిన ‘హాస్టల్‌ డేజ్‌’ వెబ్‌సిరీస్‌ యువతను బాగా ఆకట్టుకుంది. మొదటి సీజన్‌లో మంచి వినోదం పంచడంతో ఇప్పుడు రెండో సీజన్‌కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. 


పంచాయత్‌ 2

ప్రతి ఇంటి కథలా అనిపించి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది ‘పంచాయత్‌’ వెబ్‌సిరీస్‌. ఇదొక ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ జీవిత కథ. గతేడాది అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై కుటుంబ ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ  ఏడాది సీజన్‌ 2తో ప్రేక్షకుల ముందుకు రానుంది. 


ముంబై డైరీస్‌ 

2008 నవంబర్‌ 26న జరిగిన తీవ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రజల ప్రాణాలు కాపాడడానికి వైద్యులు     అవిశ్రాంతంగా ఎలా శ్రమించారనే  కథతో ‘ముంబై డైరీస్‌’ను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఈ వెబ్‌సిరీస్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. మార్చిలో అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ వెబ్‌సిరీస్‌ విడుదలవుతుంది. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.