రామయ్యయోగి మఠం సమీపంలో సంచరిస్తున్న ఎలుగుబంటి
తాటిచర్లమోటులో సంచారంతో ప్రజల బెంబేలు
కొమరోలు, జూన్ 22: మండలంలోని తాటిచెర్లమోటు గ్రామంలోని ఆవె రామయ్య యోగి మఠం సమీపంలో మంగళవారం రాత్రి నుంచి ఎలుగుబంటి సంచరిస్తుండడంతో స్థానికులు భయబ్రాంతులు చెందుతున్నారు. కొందరు స్వయంగా ఎలుగుబంటిని చూసి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని మఠం గదుల్లో తలుపులు వేసుకొని బిక్కుబిక్కుమంటున్నారు. సమాచారాన్ని ఫోన్ల ద్వారా తాటిచెర్ల గ్రామస్థులకు తెలియజేశారు. గ్రామస్థులు అటవీ అధికారులకు విషయాన్ని తెలిపారు. వారు బుధవారం ప్రత్యేక బోనును తెప్పించి మఠం సమీపంలో ఏర్పాటు చేసి మాటు వేశారు. మరోపక్క గ్రామస్థులు ఇటువైపునకు రాకుండా అప్రమత్తం చేశారు.