బాసరలో భక్తుల సందడి ప్రారంభం

ABN , First Publish Date - 2021-06-21T07:26:31+05:30 IST

బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో భక్తుల సందడి ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తి వేడయంతో అర్జిత సేవలన్నీ ఆదివారం నుండి మొదలయ్యాయి. ఉద యమే సరస్వతీ అమ్మవారికి పండితులు అభిషేక పూజలు చేశారు. అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు.

బాసరలో భక్తుల సందడి ప్రారంభం
పిల్లలకు అక్షర శ్రీకార పూజలు జరిపిస్తున్న భక్తులు

38 రోజుల లాక్‌డౌన్‌ తర్వాత భక్తుల దర్శనాలు 

మొదలైన అక్షర శ్రీకార పూజలు 

బాసర, జూన్‌ 20: బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో భక్తుల సందడి ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తి వేడయంతో అర్జిత సేవలన్నీ ఆదివారం నుండి మొదలయ్యాయి. ఉద యమే సరస్వతీ అమ్మవారికి పండితులు అభిషేక పూజలు చేశారు. అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతించారు. చిన్నపిల్లలకు అక్షర శ్రీకార పూజలు కూడా ప్రారంభించారు. ఆదివారం చాలా మంది భక్తు లు తమ పిల్లలకు పూజలు జరిపించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా అధికారులు తిరిగి ప్రారంభిం చారు. మాస్క్‌ ఉన్న భక్తులకే లోనికి అనుమతిస్తున్నారు.

Updated Date - 2021-06-21T07:26:31+05:30 IST