తిరుమలలో భజన సంప్రదాయాన్ని కొనసాగించాలి

Sep 22 2021 @ 01:04AM
నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న యాదగిరి

కలెక్టరేట్‌ వద్ద జానపద వృత్తి కళాకారుల నిరసన


చిత్తూరు, సెప్టెంబరు 21: తిరుమల కొండపై భజన సంప్రదాయాన్ని కొనసాగించాలని జానపద వృత్తి కళాకారుల సంఘ జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్‌ చేశారు. తిరుమలలో జానపద వృత్తిని నిర్వీర్యం చేసేలా టీటీడీ పాలకమండలి వ్యవహరిస్తోందంటూ మంగళవారం కలెక్టరేట్‌ వద్ద కళాకారులతో కలిసి నిరసన తెలిపారు. కరోనా సమయంలో కొండపై భజన కార్యక్రమాలను నిలిపేశారన్నారు. అప్పటి నుంచి కళాకారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ విషయాలను టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్లి సంప్రదాయాలు కాపాడేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. తిరుమలలో వెంటనే భజనలను పునఃప్రారంభించాలని, లేకుంటే 13 జిల్లాల కళాకారులతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కళాకారులను రప్పించి, పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌ హరినారాయణన్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.