పంజాబ్‌లో సీట్ల షేరింగ్ ఖరారు.. 65 స్థానాల్లో బీజేపీ పోటీ

ABN , First Publish Date - 2022-01-24T21:53:29+05:30 IST

పంజాబ్‌లో తమ భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల షేరింగ్ ఒప్పందం కుదిరినట్టు..

పంజాబ్‌లో సీట్ల షేరింగ్ ఖరారు.. 65 స్థానాల్లో బీజేపీ పోటీ

న్యూఢిల్లీ: పంజాబ్‌లో తమ భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల షేరింగ్ ఒప్పందం కుదిరినట్టు భారతీయ జనతా పార్టీ సోమవారంనాడు ప్రకటించింది. ఇందులో భాగంగా 65 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్తగా ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్‌ కాంగ్రెస్ (పీఎల్‌సీ) 37 స్థానాల్లో పోటీ చేస్తుందని, సాద్ (సంయుక్త్)కు 15 సీట్లు కేటాయించామని చెప్పారు. పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను ఫిబ్రవరి 20న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది, మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2022-01-24T21:53:29+05:30 IST