తప్పిన పెనుప్రమాదం

ABN , First Publish Date - 2022-05-28T07:32:28+05:30 IST

తిరుమలలో గోశాల పక్కనే ఉన్న పిండిమరలో శుక్రవారం రాత్రి స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది.

తప్పిన పెనుప్రమాదం

తిరుమల, మే 27 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో గోశాల పక్కనే ఉన్న పిండిమరలో శుక్రవారం రాత్రి స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. సాధారణంగా ఇక్కడ పప్పుదినుసులు వేసి, పిండిని తయారు చేస్తుంటారు. ఈ క్రమంలో హఠాత్తుగా పిండిమరలో మంటలు వ్యాపించాయి. సిబ్బంది అప్రమత్తమై ఫైర్‌ అధికారులకు సమాచారమిచ్చారు. వారు ఫైరింజన్‌తో హుటాహుటిన ఘటనాప్రాంతానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఎలాంటి ఆస్తినష్టం వాటిల్లలేదు. కాగా, పిండిమరలోని యంత్రాల్లో నుంచి వచ్చిన నిప్పురవ్వలు పక్కనే ఉన్న అట్టపెట్టెలు, గోనెసంచులపై పడటంతో అగ్నిప్రమాదం జరిగినట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. మరోవైపు నార్త్‌నుంచి పనుల నిమిత్తం వచ్చిన కొందరు వ్యక్తులు వంట చేసుకునే క్రమంలో ప్రమాదం జరిగి ఉండవచ్చనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ సిబ్బంది అప్రమత్తం కావడంతో పెనుప్రమాదమే తప్పింది. ప్రమాదానికి అతి దగ్గర్లోనే నెయ్యి ట్యాంకర్లు కూడా ఉండటం గమనార్హం. 

Updated Date - 2022-05-28T07:32:28+05:30 IST