
జనగామ: జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సునకు పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ఘనపూర్ శివారులో స్కూల్ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో బస్సు ముందుభాగం ధ్వంసమైంది. రెండు వాహనాల మధ్య డ్రైవర్ ఇరుక్కుపోయాడు. అయితే పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. మడికొండ బ్రాంచ్‌కి చెందిన మాస్టర్ జి స్కూల్ బస్సుగా గుర్తించారు. పిల్లలను చాగల్, రాఘవపూర్‌లో దింపేందుకు బస్సు వెళుతోంది. ప్రమాదం తప్పడంతో పిల్లలు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి