బైక్‌ అదుపు తప్పి యువకుడి మృతి

May 7 2021 @ 00:14AM

నంగునూరు, మే 6: నంగునూరు మండలం పాలమాకుల శివారులో బైక్‌ అదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందాడు. గురువారం రాజగోపాల్‌పేట ఎస్‌ఐ మైపాల్‌రెడ్డి వివరాల ప్రకారం..  మండలంలోని అప్పలాయచెరువు గ్రామానికి చెందిన నాయని మైపాల్‌రెడ్డి (25) అనే యువకుడు బుధవారం రాత్రి పాలమాకుల  మీదుగా స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో పాలమాకుల శివారులోకి చేరుకోగానే బైక్‌ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి కాంతరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ  పేర్కొన్నారు. 

Follow Us on: