విద్యుత సరఫరా లేకపోవడంతో చీకట్లో ఉన్న తహసీల్దార్ కార్యాలయం
గార్లదిన్నె, జూన 28: బిల్లు చెల్లించని కారణంగా గార్లదిన్నె తహసీల్దార్ కార్యాలయానికి విద్యుత సరఫరాను ఆ శాఖ అధికారులు మంగళవారం నిలిపివేశారు. విద్యుత బిల్లులు సుమారు రూ.1.40 లక్షలు బకాయి ఉన్నట్లు సమాచారం. బకాయి చెల్లించాలని పలుమార్లు కోరినా స్పందన లేకపోవడంతో విద్యుత శాఖ అధికారులు సరఫరాను నిలిపేశారు. దీంతో కార్యాలయంలో పలు పనులు నిలిచిపోయాయి. బకాయిలు చెల్లించాలని, లేదంటే ఉన్నతాధికారుల నుంచి సిఫార్సు చేయించాలని కోరామని, అయినా పట్టించుకోకపోవడంతో విద్యుత సరఫరా నిలిపివేశామని ఏఈ శివప్రసాద్ తెలిపారు. నిధుల కొరత కారణంగా బకాయి చెల్లించలేదని ఇనచార్జి తహసీల్దార్ షర్మిల తెలిపారు. సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.