టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం బీజేపీనే

ABN , First Publish Date - 2022-05-29T06:06:20+05:30 IST

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం బీజేపీనే

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం బీజేపీనే
మాట్లాడుతున్న ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, పక్కన మాజీ మంత్రి చంద్రశేఖర్‌


  • పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి 
  • కేటీఆర్‌ది ప్రధాని మోదీని విమర్శించే స్థాయా? : మాజీ మంత్రి చంద్రశేఖర్‌ 

పరిగి, మే28 : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రె్‌సలకు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శనివారం పరిగిలోని ఎబీఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో బీజేపీ వికారాబాద్‌ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యెన్నం మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్‌ పట్ల ప్రజలు విసుగుచెంది ఉన్నారని, ఈ అవకాశాన్ని బీజేపీ అందిపుచుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల ఆశలను ఈసారి నిజం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మోదీ నాయకత్వంలో బీజేపీకి ప్రజలు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని అన్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల మధ్య జరిగే ముక్కోణపు పోటీలో.. కష్టించి పనిచేస్తే విజయం సాధించే అవకాశాలున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నాయకులకు బీజేపీలో చేర్చుకోవాలని సూచించారు. ప్రధాని మోదీకి ప్రజల్లో మంచి పేరుందని, కేంద్రప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళితే పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. అనంతరం మాజీ మంత్రి, బీజేపీ నాయకులు డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కనిపించని కేటీఆర్‌కు ప్రధాని మోదీని విమర్శించే స్థాయి ఎక్కడిదన్నారు. ప్రపంచ దేశాలన్నీ మోదీని ప్రశంసిస్తుంటే, ఏనుగును ఎలుక గీకినట్లు కేటీఆర్‌, మోదీని విమర్శిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ప్రధాని చేపట్టే విధివిధానాలను, పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. త్వరలో జిల్లాస్థాయిలో బీజేపీ సభలను నిర్వహించబోతున్నామని తెలిపారు. అనంతరం ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్జి కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మే 31నుంచి జూన్‌14 వరకు బీజేపీ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. 15 రోజులపాటు వివిధ విభాగాల కమిటీ బాధ్యులు కేంద్రప్రభుత్వ నిధులు, పథకాలను గ్రామాల్లోని ప్రజలకు వివరిస్తూ.. వారిని పార్టీ వైపు మళ్లించుకునే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాద్‌రావు, బీజేపీ యాదాద్రి జిల్లా ఇన్‌చార్జి నందకుమార్‌యాదవ్‌, వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి, ఉపాధ్యక్షులు ఘణాపూర్‌ వెంకటయ్యగౌడ్‌, హరికృష్ణయాదవ్‌, మల్లేశం, కార్యదర్శులు శివరాజు, రాంచందర్‌, పాండు, కేశవులు, వివిధ మండలాల అఽధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T06:06:20+05:30 IST