వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవాలి

ABN , First Publish Date - 2022-07-01T06:04:58+05:30 IST

వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవాలి

వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవాలి
అశ్వారావుపేట సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి విష్ణుదేవ్‌సాయి

శ్రేణులకు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల దిశానిర్దేశం 

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సమావేశాలు

ఖమ్మం/కొత్తగూడెం, జూన 30 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బూతస్థాయిలో ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నియమించిన నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన ఎంపీలు, ఇతర జాతీయ నాయకులు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఖమ్మంరూరల్‌ మండలంలో ఎంపీ లక్ష్మీకాంతబాజ్‌పాయ్‌ కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. కిసానమోర్చా రాష్ట్రఅధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పాల్గొన్నారు. ఖమ్మంలో నియోజకవర్గస్థాయి బూతకమిటీ సమావేశం జరగ్గా.. పరిశీలకుడిగా వచ్చిన జాతీయ అధికార ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్‌ ప్రధాని నరేంద్రమోదీ సభకు అధికసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇనచార్జ్‌ ఉప్పల శారద, కార్పొరేటర్‌ దొంగల సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. మధిరలో ఎంపీ సంధ్యారే, సత్తుపల్లిలో బీజేపీ అధికారప్రతినిధి ముకుత మణి అధికారి, వైరాలో ఎంపీ ప్రమీలాబెన బెహర అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ సమావేశంలో ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి విష్ణుదేవ్‌సాయి పాల్గొనగా, కొత్తగూడెంలో ఛత్తీ్‌సగఢ్‌ ప్రతిపక్ష నాయకుడు థరమ్‌ లాల్‌ కౌశిక్‌ ఆరు మండలాల బీజేపీ అధ్యక్షులు, యువమోర్చా నాయకులతో లక్ష్మీదేవిపల్లి మండలంలో సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు, టోబాకో బోర్డు చైర్మన బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు ఎడ్లవల్లి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో మాజీ కేంద్రమంత్రి, రక్షణశాఖ పార్లమెంట్‌ కమిటీ చైర్మన జ్యూయల్‌ ఓరాం, పినపాక నియోజకవర్గ సమావేశం మణుగూరులో జరగ్గా..బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌ హాజరయ్యా రు. ఇల్లెందు నియోజకవర్గానికి ఛత్తీ్‌సగఢ్‌ మాజీమంత్రి లతావు చండీ ఇన్‌చార్జ్‌గా నియమితులయ్యారు. ఆయన శుక్రవారం ఇల్లెందులో సమావేశం నిర్వహించనున్నారు. 



Updated Date - 2022-07-01T06:04:58+05:30 IST