కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ

ABN , First Publish Date - 2021-01-17T05:21:33+05:30 IST

రామగుండం కార్పొరేషన్‌లో ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ కార్పొరేటర్ల ఆధ్వ ర్యంలో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని శ నివారం ముట్టడించారు.

కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ
కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు

కోల్‌సిటీ, జనవరి 16: రామగుండం కార్పొరేషన్‌లో ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ బీజేపీ కార్పొరేటర్ల ఆధ్వ ర్యంలో రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని శ నివారం ముట్టడించారు. అనంతరం కార్పొరేటర్లు కౌశిక ల త, దుబాసి లలిత, కల్వల శిరీష మాట్లాడుతూ రామగుం డం కార్పొరేషన్‌లో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, మిషన్‌ భగీరథ ద్వారా 24గంటల మంచినీటి సరఫరా చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు మంచినీటిని స రపరా చేయడం లేదని, పక్కనే గోదావరి ఉన్నా రెండు రోజులకోసారి తాగునీటిని అందిస్తున్నారని, అర్హులైన లబ్ధిదారులకు ఏడు సంవత్సరాలుగా రేషన్‌కార్డులు మంజూరు కా వడం లేదని, అర్హులైన వికలాంగు లు, వృద్ధులు, వితంతువులకు ఇ ప్పటి వరకు పెన్షన్లు ఇవ్వలేదని, ఆరేళ్లుగా అర్జీలు పెట్టుకున్నా అ ర్హులకు పెన్షన్లు మంజూరు చేయ డంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. అంతేకాకుం డా కార్పొరేషన్‌లో రోడ్లు, డ్రైనేజీల పరిస్థితి అధ్వానంగా ఉన్నాయని, చిన్న వర్షాలకే రోడ్లపై, డ్రైనేజీలు నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కార్పొరేషన్‌ ప ట్టించుకోవడం లేదన్నారు. పాలకవర్గం ఏర్పాటు అయి ఏడాది కావస్తున్నా ఏ ఒక్క అభివృద్ధికి పనికి కూడా నోచుకోలేదని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కార్పొరేషన్‌ పాలకులు, అధికారులు విఫలం చెందారని, పెండింగ్‌లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ ల పనులను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కార్పొరేషన్‌ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. అంతకుముందు గో దావరిఖని చౌరస్తా నుంచి కార్పొరేషన్‌ వరకు బీజేపీ శ్రేణు లు భారీర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి జక్కుల నరహరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రవీంద ర్‌, రామన్న, రవీందర్‌రెడ్డి, రాజు, మల్లేష్‌, సంజీవ్‌, శశికుమార్‌, లక్ష్మీనర్సయ్య, రాంబాబు, సంజీవ్‌, మహేష్‌, విజయ్‌, గోవర్ధన్‌, శ్రీను, విజయ్‌, విశ్వాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-17T05:21:33+05:30 IST