ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి పార్థివ దేహం..

Published: Wed, 01 Dec 2021 07:35:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి పార్థివ దేహం..

తెలుగు చిత్ర పరిశ్రమలోని సాహిత్య శిఖరం 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి నిన్న సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు కొద్దిసేపటికి క్రితం ఫిల్మ్‌ నగర్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌కు తరలించారు. సీతారామశాస్త్రి నెల 24న న్యుమోనియాతో బాధపడుతూ కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందూతూ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో నిన్న సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అభిమానుల సందర్శన అనంతరం సిరివెన్నెల అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక చాంబర్ నుండి పదిగంటల ముప్పై నిమిషాలకు బాడీని మహాప్రస్థానంకి తీసుకుని వెళ్ళనున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International