ట్రాక్టర్‌ కంప్రెషర్‌ కిందపడి బాలుడి మృతి

ABN , First Publish Date - 2022-06-29T06:03:15+05:30 IST

అప్పటివరకు తల్లిదండ్రులతో కలిసి తిరిగిన కుమారుడు స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన కాసేపటికే మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ట్రాక్టర్‌ కంప్రెషర్‌ కిందపడి బాలుడి మృతి
మృతి చెందిన యువకిరణ్‌

గాజువాక, జూన్‌ 28: అప్పటివరకు తల్లిదండ్రులతో కలిసి తిరిగిన కుమారుడు స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన కాసేపటికే మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హృదయ విదారక సంఘటన మంగళవారం గాజువాక దరి దుర్గానగర్‌లో చోటుచేసుకుంది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దుర్గానగర్‌కు చెందిన బసవ ప్రకాశ్‌ పెయింటింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈయన కుమారుడు యువకిరణ్‌ (12) స్నేహితులతో కలిసి ఆదుకునేందుకు ఇంటి పక్కనే వున్న పార్కులోకి వచ్చాడు. అయితే అక్కడ ఓ ట్రాక్టర్‌ కంప్రెషర్‌ ఏటవాలు ప్రాంతంలో పార్కింగ్‌ చేసి ఉంది. పిల్లలందరూ దానిపైకి ఆడుకుంటున్న సమయంలో ఒక పిల్లవాడు ట్రాక్టర్‌ కంప్రెషర్‌ క్లచ్‌ నొక్కడంతో అదికాస్త ముందుకు జరిగింది. దీంతో వారంతా భయపడి కిందకు దూకేశారు. యువకిరణ్‌ కూడా దూకేందుకు యత్నించినప్పటికీ ఆ పక్కనే రోలర్‌ వుండడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో కంప్రెషర్‌ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2022-06-29T06:03:15+05:30 IST