Advertisement

చెరువులో పడి బాలుడి మృతి

Jan 17 2021 @ 00:42AM

కుభీర్‌, జనవరి 16 : మండలంలోని బెల్గామ్‌ గ్రామానికి చెందిన సూరజ్‌ (12) అనే బాలుడు ప్రమాదవశాత్తు శుక్రవారం రాత్రి చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. వివరాల ప్రకారం.. బెల్గామ్‌ గ్రామా నికి చెందిన సాగర్‌ కుమారుడు సూరజ్‌ చెరువుకు వెళ్లి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందాడు. సూరజ్‌ మృతి పట్ల తల్లి దండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. శనివారం తండ్రి సాగర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు

Follow Us on:
Advertisement