ట్రాక్టర్‌ కింద పడి బాలుడి మృతి

ABN , First Publish Date - 2021-10-17T04:46:25+05:30 IST

ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కింద పడి బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని జక్కన్నపేటలో శనివారం జరిగింది.

ట్రాక్టర్‌ కింద పడి బాలుడి మృతి

హవేళీఘణపూర్‌, అక్టోబరు 16: ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కింద పడి బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని జక్కన్నపేటలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జక్కన్నపేట గ్రామానికి చెందిన బోయిని నారాయణ కుమారుడు సుమంత్‌(6) గ్రామంలో చెత్తసేకరించేందుకు వచ్చిన పంచాయతీ ట్రాక్టర్‌ కింద ప్రమాదవశాత్తు పడగా తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబీకులు వెంటనే మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించేవరకే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవపంచనామ చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.  

Updated Date - 2021-10-17T04:46:25+05:30 IST