మంత్రి కారులో బడికి బాలుడు

ABN , First Publish Date - 2022-06-28T05:16:52+05:30 IST

తనకు చదువుకోవాలని ఉందని, చదివించాలని ఓ బాలుడు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చేయి పట్టుకుని ప్రాధేయపడడంతో చలించిన మంత్రి బాలుడి బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.

మంత్రి కారులో బడికి బాలుడు
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు నమస్కరిస్తున్న బాలుడు

మహబూబ్‌నగర్‌, జూన్‌ 27:  తనకు చదువుకోవాలని ఉందని, చదివించాలని ఓ బాలుడు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చేయి పట్టుకుని ప్రాధేయపడడంతో చలించిన మంత్రి బాలుడి బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం మంత్రి చేరదీసిన బాలుడు విజయ్‌కుమార్‌ను పాఠశాలలో చేర్పించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి తన వాహనంలో దగ్గరుండి బాలుడిని పాఠశాలకు పం పించారు. ఈ సందర్భంగా మంత్రి బాలుడిని ఆశీర్వదించి బడికి పంపించారు. మంత్రి బాలుడికి నమస్కరించడం అక్కడ ఉన్న వారందరి హృదయాలను కదిలించింది. బాలుడిని చేరదీయడంతో పాటు అన్నీ దగ్గరుండి మంత్రి చూసుకోవడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-06-28T05:16:52+05:30 IST