తల్లిదండ్రుల చెంతకు బాలుడు

ABN , First Publish Date - 2021-05-11T04:46:33+05:30 IST

తల్లిదండ్రుల చెంత నుంచి తప్పిపోయిన ఓ బాలుడిని సిద్దవటం పోలీసులు గుర్తిం చి తిరిగి వారికి అప్ప గించారు.

తల్లిదండ్రుల చెంతకు బాలుడు
బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తున్నదృశ్యం

సిద్దవటం, మే 10 : తల్లిదండ్రుల చెంత నుంచి తప్పిపోయిన ఓ బాలుడిని సిద్దవటం పోలీసులు గుర్తిం చి తిరిగి వారికి అప్ప గించారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని 11వ పోలీసు బెటాలియన్‌ వద్ద ఆదివారం రాత్రి విశాల్‌ (6) అనే బాలుడు ఏడుస్తూ నడుచుకుంటూ వెళుతుండగా కానిస్టేబుల్‌ శివప్రసాద్‌ ఆ బాలుడిని విచారించి పోలీ్‌సస్టేషన్‌కు తీసుకువచ్చాడు. కడప పట్టణం ఆర్‌.కె.నగర్‌ కాలనీకి చెందిన శివమ్మ, రమే్‌షల కుమారుడు విశాల్‌ను శనివారం వారి తల్లిదండ్రులు వారి పెద్దమ్మ దగ్గర వదిలిపెట్టి చిత్తుకాగితాలు ఏరుకునేందుకు వెళ్లారు. పెద్దమ్మ ఇంటికి నుంచి బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికినా జాడ కనిపించలేదు. చివరికి పోలీసులు ఫోన్‌ చేసి చెప్పడంతో ఆనందంతో సిద్దవటం పోలీ్‌సస్టేషన్‌కు చేరుకొని బాలుడుని తీసుకెళ్లామని తల్లిదండ్రులు తెలిపారు. సిద్దవటం ఎస్‌ఐ రమే్‌షబాబు, ఏఎ్‌సఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌ శివప్రసాద్‌, రవికుమార్‌, మహిళా పోలీసు రాణిలు బాలుడిని వారికి అప్పగించారు.

Updated Date - 2021-05-11T04:46:33+05:30 IST