ఇసుక రీచ్‌ గుంతలో పడిన బాలుడు

ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST

నిబంధనలకు విరు ద్దంగా యథేచ్చగా బాహుదా నది ఇసుక రీచ్‌లో లోతైన గుం తలు తవ్వడంతో ఒక అమాయక బాలుడు దానిలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.

ఇసుక రీచ్‌ గుంతలో పడిన బాలుడు
ఇసుక రీచ్‌ వద్ద విచారణ జరుపుతున్న పోలీసులు


అపస్మారక స్థితిలో తిరుపతిలో  చికిత్స పొందుతున్న వైనం

 గ్రామస్తుల ఆగ్రహంతో రీచ్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయిన

 జేపీ వెంచర్స్‌ సిబ్బంది

కలికిరి, మే 16: నిబంధనలకు విరు ద్దంగా యథేచ్చగా బాహుదా నది ఇసుక రీచ్‌లో లోతైన గుం తలు తవ్వడంతో ఒక అమాయక బాలుడు దానిలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.  గుండ్లూరు రెవెన్యూ గ్రామం అద్దవారిపల్లె పంచాయతీ గుంటివీరన్నపల్లె సమీపంలో బాహు దా నదిలో జేపీ వెంచర్స్‌ ద్వారా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. అదే గ్రామానికి చెందిన షబానా కుమారుడు ఉమర్‌ (11) సోమవారం ఇతర బంధువులు, వారి పిల్లలతో కలిసి పక్కనే వున్న బాహుదా నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాల వద్దకు వెళ్లారు. అక్కడ ఏరు పారుతున్న నీళ్లలోకి  ఉమర్‌ యథాలాపంగా వెళ్ళి లోతులో చిక్కుకున్నాడు. అతన్ని కాపాడబోయిన ఒకరిద్దరు మహిళలు కూడా నీటిలో చిక్కుకోగా అక్క డున్న వారు రక్షించారు. అయితే ఉమర్‌ మాత్రం అప్పటికి నీటి అడుగు లోకి వెళ్లిపోవడంతో ఒకరిద్దరు యువకులు నీటిలో దిగి ఉమర్‌ను గట్టుకు తెచ్చారు. అప్పటికే అతను అపస్మారక స్థితిలో వుండగా వెంటనే 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనం తరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ప్రస్తుతం ఉమర్‌కు అపస్మారక స్థితిలోనే ఉన్నట్లు బంధువులు తెలిపారు. కాగా సమాచారం అందుకున్న కలికిరి హెడ్‌ కానిస్టేబుల్‌ మనోహర్‌ ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదం జరిగిన పరిసరాలను పరిశీలించారు. దీని పైన ఇంకా ఫిర్యాదు అందలేదని తెలిపారు. కాగా బాలుడికి జరిగిన ప్రమాదంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు రీచ్‌ వద్దకు వెళ్ళే సరికే జేపీ వెంచర్స్‌ సిబ్బంది వాహనాలతో సహా రీచ్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.బాహుదా నదిలోని గుండ్లూరు, అద్దవారిపల్లె ఇసుక రీచ్‌లకు సంబంధించి వివాదాలు జరుగుతూనే వున్నాయి. 

Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST