girlfriend పుట్టింటికి వచ్చిందని తెలుసుకున్న ప్రియుడు.. ఆమెకు ఫోన్‌లోని వీడియోలను చూపించిన అనంతరం..

Published: Thu, 11 Aug 2022 11:20:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
girlfriend పుట్టింటికి వచ్చిందని తెలుసుకున్న ప్రియుడు.. ఆమెకు ఫోన్‌లోని వీడియోలను చూపించిన అనంతరం.. ప్రతీకాత్మక చిత్రం

ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోలేకపోయినా.. జీవితాంతం వారు బాగుండాలని చాలా మంది కోరుకుంటుంటారు. అయితే కొంత మంది మాత్రం తమ ప్రేయసికి వేరే వారితో వివాహమైతే తట్టుకోలేరు. వారిపై తమ శాడిజాన్ని చూపించడంతో పాటూ కొన్నిసార్లు దారుణాలకు కూడా పాల్పడుతుంటారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రేయసి పుట్టింటికి వచ్చిందని తెలుసుకున్న ప్రియుడు.. ఆమె వద్దకు వెళ్లాడు. తన ఫోన్లోని వీడియోలు చూపించి.. చివరకు అతడు చేసిన దారుణం.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే...

ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రం బిలాస్‌పూర్‌‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సిరగిట్టి పరిధికి చెందిన 22ఏళ్ల యువతికి.. స్థానికంగా ఉన్న ప్రమోద్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే కొన్నాళ్లకు ఆమె తల్లిదండ్రులు వేరే సంబంధం ఖాయం చేశారు. ఇటీవల యువతికి వేరే ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం (marriage) చేశారు. దీంతో అప్పటి నుంచి ప్రమోద్.. ఆమెను కలిసేందుకు ప్రయత్నాలు చేసేవాడు. కానీ సాధ్యం కాకపోవడంతో అవకాశం కోసం వేచి చూస్తూ ఉండేవాడు.

school మేనేజర్‌ను హోటల్‌కు పిలిపించుకున్న ఉపాధ్యాయురాలు.. మరుసటి రోజు వచ్చిన ఫోన్ కాల్‌తో అవాక్కయిన వ్యక్తి..

వివాహమైన రెండు నెలల తర్వాత యువతి ఇటీవలే పుట్టింటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రమోద్.. ఆమెకు ఫోన్ చేసి కలుద్దామని పిలిచాడు. అయితే ఆమె రాకపోవడంతో తానే నేరుగా ఆమె వద్దకు వెళ్లాడు. తనపై బలత్కారం చేయబోగా.. ఆమె తిరస్కరించింది. దీంతో గతంలో ఇద్దరూ కలిసి ఉన్న సందర్భంలో తీసిన వీడియోలను ఆమెకు చూపించాడు. తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే వీడియోలను (Videos) అందరికీ చూపిస్తానంటూ బెదిరించాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Groom market: పెళ్లి కొడుకుల సంత గురించి మీకు తెలుసా.. తొమ్మిది రోజుల ప్రదర్శనలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Rare operation: కంటి కింద నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. స్కానింగ్ చేసిన వైద్యులకు షాకింగ్ దృశ్యం.. చివరకు..love marriage: తన కంటే 12ఏళ్లు చిన్న వయసున్న యువకుడితో ప్రేమ వివాహం.. ఆమె తండ్రి మరణించిన నెల రోజులకు.. ఊహించని ఘటన.. Shyam Rangeela: ఎవరీ శ్యామ్ రంగీలా.. సోషల్ మీడియాలో స్టార్ కమెడియన్ అయిన ఇతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..!అర్ధరాత్రి.. లైట్ల వెలుగుపడి రోడ్డు పక్కన కనిపించిందో ఆకారం.. అనుమానంతో బస్సును ఆపి ఆ డ్రైవర్ వెళ్లి చూస్తే..Funny video: పెళ్లి పీటల మీదే ఇలా ఉంటే.. వివాహానంతరం వీళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో... videoextramarital affair: ప్రియుడిని రోజూ కలవాలనే ఉద్దేశంతో.. ఇంట్లో పిల్లలు చూస్తుండగా మహిళ చేసిన నిర్వాకం..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.