వర్షం కోసం అన్నదాత ఎదురుచూపు

ABN , First Publish Date - 2022-07-04T05:56:07+05:30 IST

వానాకాలం వ్యవసాయ సీజన్‌ ఆ రంభమైనా...అదునులో పదును వర్షం కురవకపోవడంతో ఆశించిన మేర పంటల సాగు కనిపించడం లేదు.

వర్షం కోసం అన్నదాత ఎదురుచూపు

- జిల్లాలో మంద కొడిగా పంటల సాగు

- రుతుపవనాలు తాకినా కనిపించని భారీ వర్షం

- జిల్లాలో 7 మండలాల్లో సాధారణం...2 మండలాల్లో లోటు

జగిత్యాల, జూలై 3 (ఆంధ్రజ్యోతి): వానాకాలం వ్యవసాయ సీజన్‌ ఆ రంభమైనా...అదునులో పదును వర్షం కురవకపోవడంతో ఆశించిన మేర పంటల సాగు కనిపించడం లేదు. వర్షాధారం కింద ప్రస్తుత సీజన్‌లో భా రీగా వరితో పాటు ఇతర పంటలు సాగు చేస్తారు. జగిత్యాల జిల్లాలో వ ర్షం రైతులు ఆశించిన స్థాయిలో ఇప్పటివరకు పడలేదు. జూన్‌ మాసం అన్నదాతలకు ఎటువంటి మేలు చేయకుండానే వెళ్లిపోయింది. ఏరువాక ప్రారంభం కావడం, తదుపరి నైరుతి రుతు పవనాల రాకతో ఈ సారి అ ధిక వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో రైతుల్లో ఆనందం కనిపించింది. భారీ వర్షాలు ఇప్పటివరకు లేకపోవడంతో పరిస్థితి ఇబ్బం దికరంగా మారింది. ప్రస్తుత సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు సగ టున 225.4 మిల్లీ మీటర్లు ఉండాల్సి ఉండగా 181.0 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో జూన్‌లో 184.30 మిల్లీమీటర్ల వర్షాపాతానికి గాను 175.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూలైలో ఇప్పటివరకు జిల్లాలో సగ టు వర్షపాతం 41.14 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా 5.6 ఎంఎం వర్ష పాతం నమోదైంది.

జిల్లాలో 15 మండలాల్లో వర్షం లెక్కింపు...

జిల్లాలో 18 మండలాలుండగా 15 మండలాల్లో వర్షపాతం లెక్కింపు శాస్త్రీయంగా జరుగుతోంది. కొత్తగా ఏర్పడ్డ బుగ్గారం, బీర్‌పూర్‌, జగిత్యాల అర్బన్‌ మండలాల్లో లెక్కింపు జరగడం లేదు. సాధారణం కంటే 20 శా తం నుంచి ఆ పైనా ఎక్కువగా వర్షం కురిసిన ప్రాంతాలను అధిక వర్ష పాతం జాబితాలో, 19 శాతం లోపు అధికంగా వర్షం కురిసిన ప్రాంతా లను సాధారణ జాబితాలో, మైనస్‌ 20 శాతం నుంచి మైనస్‌ 59 శాతం వరకు వర్షం కురిసిన ప్రాంతాలను లోటు జాబితాలో, మైనస్‌ 60 శాతం నుంచి మైనస్‌ 99 శాతం వరకు వర్షం కురిసిన ప్రాంతాలను తక్కువ వర్షం కురిసిన జాబితాలో అధికారులు గుర్తిస్తారు. జిల్లాలో వర్షపాతం లెక్కింపు జరుగుతున్న 15 మండలాలకు గానూ 7 మండలాల్లో సాధా రణం కంటే అధికంగా, 5 మండలాల్లో సాధారణంగా, 3 మండలాల్లో లో టు స్థాయిలో వర్షాపాతం ఉన్నట్లు జిల్లా ప్రణాళిక విభాగం అధికారులు ప్రకటించారు. 

జిల్లాలోని మండలాల్లో వర్షం పరిస్థితి ..

జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు సగటున 225.4 ఎంఎం వర్షం కురిసింది. ఏడు మండలాల్లో సాధారణం కంటే అధికంగా వర్షం కురి సింది. రాయికల్‌లో 311.8 ఎంఎం, ధర్మపురిలో 316.9 ఎంఎం, సారం గపూర్‌లో 244.0 ఎంఎం, గొల్లపల్లిలో 324.4 ఎంఎం, కొడిమ్యాలలో 196.0 ఎంఎం, వెల్గటూరులో 268.8 ఎంఎం, కథలాపూర్‌ మండలంలో 224.0 ఎంఎం వర్షం కురిసి సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. జిల్లా లో సాధారణ వర్షపాతం కింద నమోదైన మండలాలు ఆరున్నాయి. ఇం దులో మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, పెగడపల్లి, మల్యాల మండ లాల్లో సాధారణంగా వర్షం కురిసినట్లు అధికారులు లెక్కించారు. మేడిప ల్లి మండలంలో లోటు స్థాయిలో వర్షం కురిసింది. మేడిపల్లి మండలం లో ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 142.7 ఎంఎం వర్షం కురిసింది. వర్ష పాతం నమోదులో మేడిపల్లి మండలం సాధారణం కంటే 22 మిల్లీమీట ర్లు తక్కువగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మెట్‌పల్లి మండలం సైతం సాధారణం కంటే తక్కువ వర్షం కురిసింది. జిల్లాలో తక్కువ స్థా యిలో వర్షం కురిసిన జాబితాలో మెట్‌పల్లి మండలం ఉంది. మెట్‌పల్లి మండలంలో ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 127.4 ఎంఎం వర్షం కురిసింది. 

జిల్లా వ్యాప్తంగా సాగు..

జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సుమారు 4.42 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తారన్న అంచనాలున్నాయి. ఇందులో ప్రధాన పంటలయిన వరి 2.80 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 55 వేలు, కంది 13 వేలు, పత్తి 32 వేలు, పసుపు 22 వేల ఎకరాల్లో సాగు అవు తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారు 30 వే ల ఎకరాలలో రైతులు ఆయిల్‌ ఫామ్‌ వైపునకు మళ్లనున్నట్లు అంచనా ఉంది. మినుము, అనుము, చెరకు, సోయా, కూరగాయాల తదితర పంట లను రైతులు పండించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం వరి నారు పనులు పూర్తి చేసుకొని ఉన్నారు. వర్షాలు ఆశించిన మేరకు కురిస్తే నాట్లు వేసు కోవడానికి ఎదురుచూస్తున్నారు. రైతులు నాట్లు వేసుకునే సమయానికి వర్షం కురవాలని ఆశపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి నారు పనులు తొందరగానే ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేక సాగు మందకొడిగా జరుగుతోంది.

Updated Date - 2022-07-04T05:56:07+05:30 IST