డిలీట్‌ చేయకుండానే బ్రేక్‌ తీసుకోవచ్చు

ABN , First Publish Date - 2022-05-14T08:46:41+05:30 IST

వాట్సాప్‌లో మెసేజ్‌ల అదృశ్యం ఫీచర్‌, దాన్ని మరింత మెరుగ్గా మలిచేందుకు జరుగుతున్న కృషి ఒక ఎత్తు. యాప్‌ను డిలీట్‌

డిలీట్‌ చేయకుండానే బ్రేక్‌ తీసుకోవచ్చు

వాట్సాప్‌లో మెసేజ్‌ల అదృశ్యం ఫీచర్‌, దాన్ని మరింత మెరుగ్గా మలిచేందుకు జరుగుతున్న కృషి ఒక ఎత్తు. యాప్‌ను డిలీట్‌ చేయకుండానే వాట్సాప్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవచ్చు. మొబైల్‌ నుంచి యాప్‌ను డిలీట్‌ చేయకుండా మెసేజెస్‌ రాకుండా ఆపే సౌకర్యం ఉంది. అది ఎలాగంటే....


  • మొదట ఫోన్‌లో వాట్సాప్‌ని ఓపెన్‌ చేయాలి.
  • మెసెంజర్‌ ఐకాన్‌ని టాప్‌ చేయాలి. ‘ఫోర్స్‌ స్టాప్‌’ని సెలెక్ట్‌ చేసుకోవాలి.
  • అదే స్ర్కీన్‌పై, మొబైల్‌ డేటా ఏరియాని టాప్‌ చేయాలి. ‘బ్యాక్‌గ్రౌండ్‌ డేటా’ని డిజేబుల్‌ చేయాలి. 
  • మొబైల్‌ డేటాకు కనెక్ట్‌ అయినప్పుడే ఈ ట్రిక్‌ పనిచేస్తుంది.
  • ఒకసారి ఈ వ్యూహంలోకి వెళితే 4జి టర్న్‌డ్‌ ఆన్‌ చేసినప్పటికీ మెసేజ్‌లు రావు.
  • ఇది కాకుండా ‘హెల్ప్‌’ టాబ్‌లో తాత్కాలికంగా డిజేబుల్‌ చేసుకోవచ్చు. డివైస్‌ పోయినందున అకౌంట్‌ని అన్‌లింక్‌ చేయాలని కోరవచ్చు. అయితే తిరిగి 30 రోజుల్లో రీయాక్టివేట్‌ కావాల్సి ఉంటుంది. 
  • మరో మార్గం ఏమంటే, వాట్సాప్‌ నుంచి పాపప్‌ నోటిఫికేషన్‌. డిస్ట్రబ్‌ చేయకుండా ఉపశమనం పొందవచ్చు. ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. లేదంటే యాప్‌ నుంచే చేసుకోవచ్చు. 

Read more