యువకుడి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-05-26T05:26:40+05:30 IST

కడప నగరం ఖలీల్‌ నగర్‌ సమీపంలోని కట్టపై పటాన్‌ ఇమ్రాన్‌ఖాన్‌(28) అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు.

యువకుడి దారుణ హత్య
మృతదేహాన్ని పరిశీలిస్తున్న కడప డీఎస్పీ

ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించాలని కోరడమే హత్యకు కారణం

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కడప డీఎస్పీ


కడప(క్రైం), మే 25: కడప నగరం ఖలీల్‌ నగర్‌ సమీపంలోని కట్టపై పటాన్‌ ఇమ్రాన్‌ఖాన్‌(28) అనే యువకుడిని దారుణంగా హత్య చేశా రు. బుధవారం ఇంటి వద్ద ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ను అదే ప్రాంతానికి చెందిన ఇరువురు ఫోన్‌ చేసి పిలిపించుకొని ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మృతుడి వీపు, మెడపై దాదాపు 25కి పైగా కత్తిపోట్లు పొడిచి దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి, టూటౌన్‌ ఇన్‌చార్జ్‌ సీఐ నాగరాజు, చిన్నచౌక్‌ సీఐ అశోక్‌రెడ్డి, టూటౌన్‌ ఎస్‌ఐ నాగతులసీప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ తులసీనాగప్రసాద్‌ వివరాల మేరకు... ఖలీల్‌నగర్‌కు చెందిన పఠాన్‌ఇమ్రాన్‌ఖాన్‌ ప్లంబింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అశ్రుత్‌, మరో స్నేహితుడు యూనస్‌ పెయింటర్‌  పని చేసేవారు. మృతుడి వద్ద నుంచి అశ్రుత్‌, యునస్‌ అప్పుడప్పుడు కొంత కొంతగా డబ్బులు తీసుకొని దాదాపు రూ.3లక్షల వరకు అప్పు చేశారు. డబ్బులు విషయమై ఇమ్రాన్‌ఖాన్‌ అడుగుతుండేవాడు. తమనే డబ్బు అడుగాతావా అనే భావించిన ఇరువురు ఇమ్రాన్‌ను హత్య చేసేందుకు పథకం పన్నారు. బుధవారం 10 గంటలకు ఫోన్‌ చేసి ఖలీల్‌నగర్‌ కట్టపైకి పిలిపించి... ఇరువురు అతనిని కత్తితో  పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని పక్కనే ఉన్న కాలువలో పడేసి అక్కడి నుంచి పరారైనట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి సోదరి సయ్యద్‌ పర్వీన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా హత్యకు పాల్పడ్డ ఇరువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఇమ్రాన్‌ హత్యకు గురి కావడంతో వారి కుటుంబ సభ్యులు సోకసంద్రంలో మునిగిపోయారు. కాగా హత్యకు కారణం డబ్బా, లేక ఇతర కారణాలా అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. 

 

Updated Date - 2022-05-26T05:26:40+05:30 IST