విద్యుత్తు బిల్లులతో పేదలపై భారం

ABN , First Publish Date - 2020-07-07T07:28:26+05:30 IST

విద్యుత్తు బిల్లుల రూపేణా పేదలపై ప్రభుత్వం ఆర్థిక భారం మోపిందని, తక్షణమే వాటిని రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెల్ల రేషన్‌ కార్డుదారులకు, ఎంఎ్‌సఎంఈలకూ

విద్యుత్తు బిల్లులతో పేదలపై భారం

హైదరాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు బిల్లుల రూపేణా పేదలపై ప్రభుత్వం ఆర్థిక భారం మోపిందని, తక్షణమే వాటిని రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెల్ల రేషన్‌ కార్డుదారులకు, ఎంఎ్‌సఎంఈలకూ లాక్‌డౌన్‌ కాలంలో జారీ చేసిన విద్యుత్తు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు సోమవారం నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా గాంధీభవన్‌ నుంచి విద్యుత్‌సౌధ వరకు ఉత్తమ్‌ నేతృత్వంలో ర్యాలీ తలపెట్టగా.. పోలీసులు అడ్డుకున్నారు. విద్యుత్తు సౌధకు వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు ఉత్తమ్‌, షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో వారు మాత్రమే విద్యుత్తు సౌధకు వెళ్లి.. ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివా్‌సరావుకు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు గాంధీభవన్‌లో ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 95లక్షల మంది విద్యుత్తు వినియోగదారులు ఉండగా, లాక్‌డౌన్‌ సమయంలో ఇష్టానుసారం బిల్లులు జారీ చేశారని ఆరోపించారు. బీపీఎల్‌ కుటుంబాలు, చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమల వారికి బిల్లులు రద్దు చేయాలని కోరారు. టెలిస్కోపిక్‌ విధానంలో బిల్లుల భారం తగ్గే అవకాశం ఉందన్నారు. అధిక విద్యుత్తు బిల్లులపై సీఎం కేసీఆర్‌ మౌనం వహించడాన్ని ఉత్తమ్‌ ఖండించారు. 90 రోజుల విద్యుత్తు వినియోగం ఒకేసారి పరిగణనలోకి తీసుకోవడంతో అధిక స్లాబ్‌లో బిల్లులు వచ్చాయన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతిన్న సామాన్య ప్రజలను ఇది మరింత దోపిడీ చేయడమేనని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్‌ కాలంలో పేదలకు రూ.1500 సాయం చేసిన ప్రభుత్వం.. ఆ కాలంలో వినియోగించిన విద్యుత్తుకు రూ.5 వేలు బిల్లు వేసి షాకిచ్చిందన్నారు. వెంటనే మంత్రివర్గ భేటీ ఏర్పాటు చేసి.. ఎంఎ్‌సఎంఈ పరిశ్రమలు, బీపీఎల్‌ కుటుంబాలకు విద్యుత్తు బిల్లులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లను అంగీకరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, టీపీసీసీ మైనార్టీ సెల్‌ మాజీ అధ్యక్షుడు సిరాజుద్దీన్‌ మృతికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సీ ఖుంటియా, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తమ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చారు. సిరాజుద్దీన్‌ మరణం కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు.  సిరాజుద్దీన్‌ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారని   మర్రి శశిధర్‌రెడ్డి కొనియాడారు.

Updated Date - 2020-07-07T07:28:26+05:30 IST