డివైడర్‌పైకి దూసుకుపోయిన బస్సు

ABN , First Publish Date - 2021-10-17T06:24:05+05:30 IST

మండలంలోని ఒడ్డిమెట్ట హైవే జంక్షన్‌ వద్ద శనివారం పెను ప్రమాదం తప్పింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి రాజమహేంద్రవరంలో వివాహ నిశ్చితార్థానికి పెళ్లి కుమారుడి కుటుంబంలోని సుమారు 60 మందితో ఓ ప్రైవేట్‌ బస్సు బయలుదేరింది. సరిగ్గా ఒడ్డిమెట్ట వచ్చేసరికి ముందు వెళ్తున్న కారు సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుక వున్న బస్సు అదుపుతప్పి హైవే డివైడర్‌ మధ్యకు దూసుకుపోయి ఆగిపోయింది.

డివైడర్‌పైకి దూసుకుపోయిన బస్సు
అదుపు తప్పి హైవే డివైడర్‌పైకి దూసుకుపోయిన బస్సు

డ్రైవర్‌ చాకచక్యంతో ప్రయాణికులు సురక్షితం

నక్కపల్లి, అక్టోబరు 16: మండలంలోని ఒడ్డిమెట్ట హైవే జంక్షన్‌ వద్ద శనివారం పెను ప్రమాదం తప్పింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి రాజమహేంద్రవరంలో వివాహ నిశ్చితార్థానికి పెళ్లి కుమారుడి కుటుంబంలోని సుమారు 60 మందితో ఓ ప్రైవేట్‌ బస్సు బయలుదేరింది. సరిగ్గా ఒడ్డిమెట్ట వచ్చేసరికి ముందు వెళ్తున్న కారు సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుక వున్న బస్సు అదుపుతప్పి హైవే డివైడర్‌ మధ్యకు దూసుకుపోయి ఆగిపోయింది. దీంతో బస్సులో వున్న వారంతా ఒక్కసారిగా భయకంపితులయ్యారు. బస్సు డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించి, బస్సును నిలుపుదల చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్‌ సాయంతో  బస్సును బయటకు తీశారు. దీనిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఎస్‌ఐ డి.వెంకన్న చెప్పారు.

 

Updated Date - 2021-10-17T06:24:05+05:30 IST