‘కెనడియన్‌’ విజేత హలెప్‌

Published: Tue, 16 Aug 2022 06:37:16 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కెనడియన్‌ విజేత హలెప్‌

టొరొంటో: ప్రపంచ టెన్నిస్‌ మాజీ నెంబర్‌వన్‌ క్రీడాకారిణి సిమోనా హలెప్‌ కెనడియన్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో రొమేనియా స్టార్‌ హలెప్‌ 6-3, 2-6, 6-3తో బ్రెజిల్‌కు చెందిన బేట్రిజ్‌ హదాద్‌ మయియాను ఓడించి మూడోసారి ఈ ట్రోఫీని అందుకుంది. రెండుసార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేత అయిన హలె్‌పకిది కెరీర్‌లో తొమ్మిదో డబ్ల్యూటీఏ 1000 టైటిల్‌ కావడం విశేషం. ఈ విజయంతో హలెప్‌ ఆరో ర్యాంకుతో మళ్లీ టాప్‌-10లోకి రానుంది.   

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.