ఆక్సిజన్‌ పడకల సామర్థ్యం పెంచాలి

ABN , First Publish Date - 2021-05-11T04:19:37+05:30 IST

ఎన్టీఆర్‌ వైద్యాలయంలో ఆక్సిజన్‌ పడకల సామర్థ్యాన్ని పెంచాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.

ఆక్సిజన్‌ పడకల సామర్థ్యం పెంచాలి
నెహ్రూచౌక్‌ కూడలిలో ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు

ప్రజా సంఘాల ఆందోళన

అనకాపల్లి, మే 10:
ఎన్టీఆర్‌ వైద్యాలయంలో ఆక్సిజన్‌ పడకల సామర్థ్యాన్ని పెంచాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నెహ్రూచౌక్‌ కూడలిలో సోమవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వైద్యాలయంలో 5 కేఎల్‌ కెపాసిటీ కలిగిన ఆక్సిజన్‌ సిలిండర్‌ ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న 50 ఆక్సిజన్‌ పడకల స్థాయిని 250 ఆక్సిజన్‌ పడకలకు పెంచాలన్నారు. ఎన్టీఆర్‌ వైద్యాలయాన్ని పూర్తిస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా మార్పు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్‌ కనిశెట్టి సురేశ్‌బాబు, వ్యవసాయదారుల సహ కార వేదిక అధ్యక్షుడు చదరం నాగేశ్వరరావు, సామాజిక హక్కుల వేదిక కన్వీనర్‌ రాజాన దొరబాబు, సామాజిక న్యాయవాది శేఖరమంత్రి సాయి వెంకట లక్ష్మణరావు, సామాజిక కార్యకర్త కర్రి రాఘవనాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T04:19:37+05:30 IST