Advertisement

మంటల్లో చిక్కుకున్న కారు

Mar 5 2021 @ 23:36PM
మంటలు ఆర్పుతున్న ఫైర్‌ సిబ్బంది

ఆదిభట్ల: అకస్మాత్తుగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధం అయిన సంఘటన ఆదిభట్ల మున్సిపాలిటీ ప రిధి కొంగరకలాన్‌  సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం ఫైర్‌ ఆఫీసర్‌ రామ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాదుకు చెందిన హరీష్‌ క్యా బ్‌ డ్రైవర్‌ వృత్తిలో భాగంగా నాగోలు నుండి ప్యాసింజర్‌ను తీసుకొని కొంగ ర కలాన్‌ వెళ్తున్నాడు. ఔటర్‌ సర్వీస్‌ రోడ్డులో కారు ఇంజిన్‌ నుంచి పొగ లు రావడంతో కారు ఆపి బానెట్‌ పైకెత్తి చూసేలోపే చెలరేగాయి. వెంటనే 100 డయల్‌ చేశాడు. ఫైరింజితో మంటలు ఆర్పేశారు.

Follow Us on:
Advertisement