ఆటోను ఢీకొన్న కారు

ABN , First Publish Date - 2022-05-29T05:53:57+05:30 IST

కోసంగిపురం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విష మంగా ఉంది.

ఆటోను ఢీకొన్న కారు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

 10 మందికి తీవ్ర గాయాలు
 ఆటో డ్రైవర్‌ పరిస్థితి విషమం
పలాస:
కోసంగిపురం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం  జరిగిన ప్రమాదంలో  10 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విష మంగా ఉంది. మండలంలోని రెంటికోట గ్రామానికి చెందిన ఆశ్రమ నిర్వాహకు డు రామానందస్వామి తన కుమార్తె త్రివేణి మంత్రకు వివాహం కుదిరిన నేప థ్యంలో ఒడిశా రాష్ట్రం మంత్రిడి గ్రామంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు శనివారం వేకువజామున 5 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో బయ లుదేరారు. కోసంగిపురం జంక్షన్‌ వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొని వెళ్లిపోయింది. దీంతో ఆటో రోడ్డు పక్కన చిన్న కాలువలో బోల్తా పడింది.  ఈ ఘటనలో రామానందస్వామి, కుమార్తె త్రివేణి, కుటుంబ సభ్యులు నిత్యానంద, జయకృష్ణ, నర్మద, అమర్నాథ్‌, హేమలత, భాగ్యలక్ష్మి, హిమతో పాటు ఆటో డ్రైవర్‌ రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఆయనను శ్రీకాకుళం జీజీహెచ్‌కు  తరలించా రు. మిగతా క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు(గుజరాత్‌)ను కంచిలి రోడ్డులో పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-05-29T05:53:57+05:30 IST