పిల్లుల కవాతు!
ABN , First Publish Date - 2021-04-29T05:30:00+05:30 IST
మీరు చాలా రకాల పండుగల గురించి విని ఉంటారు. కానీ బెల్జియంలోని ఏప్రెస్ నగరంలో జరిగే క్యాట్ ఫెస్టివల్ గురించి విన్నారా? ఆ పండగ విశేషాలు ఇవి....
మీరు చాలా రకాల పండుగల గురించి విని ఉంటారు. కానీ బెల్జియంలోని ఏప్రెస్ నగరంలో జరిగే క్యాట్ ఫెస్టివల్ గురించి విన్నారా? ఆ పండగ విశేషాలు ఇవి....
- మే నెల రెండో ఆదివారం క్యాట్ పరేడ్ పేరుతో ఒక కవాతును నిర్వహిస్తారు. పిల్లుల మాదిరి వేషాలు వేసుకొని, నృత్యాలు చేస్తూ వీధుల్లో తిరుగుతారు. ఈ వేడుకను చూసేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. దీనిని ‘ఫెస్టివల్ ఆఫ్ ద క్యాట్’ అని కూడా పిలుస్తారు.
- ఒకప్పుడు ఏప్రెస్లో వస్త్రపరిశ్రమ బాగా విస్తరించి ఉండేది. ఇంగ్లండ్ నుంచి దిగుమతి చేసుకున్న ఉన్నితో దుస్తులు తయారుచేసే వారు. అలా దిగుమతి చేసుకున్న ఉన్ని, తయారుచేసిన దుస్తులను క్లాత్హాల్లో భద్రపరిచేవారు. ఆ దుస్తులకు ఎలుకలు రంధ్రాలు చేసేవి. దాంతో వ్యాపారులకు నష్టాలు రావడం మొదలయింది.
- ఎలుకల బెడదను నివారించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. చివరకు పిల్లులను పెంచడం ప్రారంభించారు. ఒకానొక దశలో పిల్లుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దాంతో పిల్లుల సంఖ్య తగ్గించడానికి వాటిని చంపడం మొదలెట్టారు. అప్పటి నుంచి ఆ పద్ధతి కొనసాగుతూ వస్తోంది. పరేడ్ పూర్తయిన తరువాత స్థానికంగా ఉన్న టవర్‌పై నుంచి పిల్లులను కింద పడేస్తుంటారు.