Advertisement

సీబీఐ విచారణ జరిపించాలి

Mar 1 2021 @ 23:52PM
రిలే నిరాహార దీక్షలో వనపర్తి న్యాయవాదులు

- బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మున్నూరు రవీందర్‌  

-  రిలే నిరాహార దీక్షలో న్యాయవాదులు 

వనపర్తి క్రైమ్‌, మార్చి 1: న్యాయవాదులు వామ న్‌రావు దంపతుల హత్య కేసును సీబీఐ విచారణ జరిపించాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మున్నూరు రవీందర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశా రు. సోమవారం పట్టణంలో బార్‌ అ సోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదుల దంపతుల హత్యను నిరసిస్తూ రిలేనిరాహార దీక్ష చేపట్టారు. ఈ సంద ర్భంగా రవీందర్‌  మాట్లాడుతూ న్యాయవాద దం పతుల కేసుల్లో ఉన్న వారందరిపై చట్ట ప్రకారం క ఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయవాదు లకు రోజు రోజుకు రక్షణ లేకుండా పోతుందన్నారు.  న్యాయవాదులకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజవర్ధ న్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కృష్ణ, సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాం గ్రెస్‌ నాయకులు పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ కౌన్సిలర్‌ సతీష్‌ యాదవ్‌ త దితరులు మద్దతు తెలిపారు. దీక్షలో న్యాయవాదు లు, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మోషన్‌ యాదవ్‌, శ్రీనివాస్‌, తిరుపతయ్య, విజయభాస్కర్‌, బాల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

  దోషులను కఠినంగా శిక్షించాలి 

 ఆత్మకూరు: హైకోర్టు న్యాయవాదులు వామన్‌ రావు, నాగమణిలను దారుణంగా హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని  తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నాయకులు కోరారు. సో మవారం జూనియర్‌ సివిల్‌ కోర్టు ముందు న్యాయ వాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పా రెడ్డి, అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణగా ప్రత్యేక చట్టం ఏర్పాటు చేసి రక్షణ కల్పిం చాలని  డిమాండ్‌ చేశారు. న్యాయవాదులు జీకే. రాములు, కిశోర్‌, ముక్తేశ్వర్‌, వినయ్‌  పాల్గొన్నారు.

 

Follow Us on:
Advertisement