AP debt log: ఏపీ అప్పుల చిట్టాను మరోసారి బయటపెట్టిన కేంద్రం

ABN , First Publish Date - 2022-07-26T18:36:02+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుల చిట్టాను కేంద్రం మరోసారి పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టింది.

AP debt log: ఏపీ అప్పుల చిట్టాను మరోసారి బయటపెట్టిన కేంద్రం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) రాష్ట్ర అప్పుల చిట్టాను కేంద్రం(Central) మరోసారి పార్లమెంట్ (Parliament) సాక్షిగా బయటపెట్టింది. అనుమతి ఇచ్చిన అప్పుల్లో ఏపీ... మూడు నెలల్లోనే సగానికి పైగా రుణాలు తీసుకున్నట్లు రాజ్యసభలో కేంద్ర ఆర్ధిక శాఖ(Central Finance Department) చెప్పింది. కేంద్రం, నాబార్డ్ (NABARD) నుంచి కూడా ఏపీ రుణాలు పొందినట్లు తెలిపింది. 202‌2-23 ఆర్ధిక సంవత్సరంలో ఏపీకి నికర రుణ పరిమితి కింద రూ.44574 కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని పేర్కొంది. మొదటి 9 నెలలకు రూ. 40,803 కోట్లు రుణం తీసుకునేందుకు అనుమతి లభించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.


ఏప్రిల్ నాటికే అంటే మొదటి మూడు నెలల్లోనే సుమారు 50 శాతానికి పైగా రుణాలు తీసుకున్నట్లు చెప్పింది. ఏప్రిల్ వరకే... రూ.21890 కోట్లు రుణాన్ని బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్నట్లుగా కేంద్ర ఆర్థికశాఖ బయట పెట్టింది. ఇది కాక కేంద్రం నుంచి మరో రూ.1373.47 కోట్లు రుణం ఏపీ తీసుకున్నదని తెలిపింది. నాబార్డ్ నుంచి ఏపీ రూ.40.17 కోట్లు అప్పు చేసినట్లు వెల్లడించింది. అందినకాడికి, అప్పు పుట్టిన ప్రతి చోటా ఎడాపెడా రుణాలు తీసుకుంటున్నట్లు కేంద్రం పేర్కొంది. ఏపీ అప్పులపై పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 

Updated Date - 2022-07-26T18:36:02+05:30 IST