సమ్మెతో కేంద్రానికి కనువిప్పు కావాలి

ABN , First Publish Date - 2021-12-08T06:33:30+05:30 IST

కేంద్రా నికి కనువిప్పు కలిగేలా ప్రైవేటీకరణకు వ్యతిరే కంగా మూడురోజుల సమ్మె విజయవంతం చేసి కార్మిక శక్తి చాటాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

సమ్మెతో కేంద్రానికి కనువిప్పు కావాలి
మాట్లాడుతున్న కార్మిక జేఏసీ నాయకులు

- కార్మిక సంఘాల జేఏసీ నాయకులు

యైటింక్లయిన్‌కాలనీ, డిసెంబరు 7: కేంద్రా నికి కనువిప్పు కలిగేలా ప్రైవేటీకరణకు వ్యతిరే కంగా మూడురోజుల సమ్మె విజయవంతం చేసి కార్మిక శక్తి చాటాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళ వారం ఓసీపీ-3 కృషి భవన్‌లో జరిగిన గేట్‌మీ టింగ్‌లో వారు మాట్లాడారు. సింగరేణికి చెంది న నాలుగు గనులను కాపాడుకుందామని, సమష్టి పోరాటాల ద్వారా మాత్రమే అది సాధ్యమని పేర్కొన్నారు. ఇప్పటికే నాలుగు బొగ్గు బ్లాక్‌ల కోసం సింగరేణి భారీ ఖర్చు చేసిందని, నాలుగు బ్లాక్‌లు సింగరేణికే దక్కే వరకు అవసరమైతే దీర్ఘకాలిక పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కోల్‌ఇండియాలో 33 శాతం వాటా అమ్మిన కేంద్రం సింగరేణి గనులను వేలం వేయనున్న దని తెలిపారు. సింగరేణి కార్మికులది గొప్ప పోరాట వారసత్వమన్నారు. అనేక హక్కులను పోరాటాల ద్వారా సాధించుకున్న చరిత్ర మనదన్నారు. గనుల వేలాన్ని అడ్డుకునేలా 9,10,11 తేదీల్లో సమ్మె విజయవంతం చేయాల ని పిలుపునిచ్చారు. ఈ గేట్‌మీటింగ్‌లో వైవీ రావు, సత్యనారాయ ణరెడ్డి, సంజీవరావు, ఉల్లి మొగిలి, సారంగపాణి, రాజారత్నం, విజయ్‌ మోహన్‌, బేతి చంద్రయ్య, ఎస్‌ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T06:33:30+05:30 IST