సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-05-22T06:00:33+05:30 IST

దేశంలో సామాన్యుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం బీ జేపీ ప్రభుత్వమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మెట్‌పల్లి, మే 21: దేశంలో సామాన్యుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం బీ జేపీ ప్రభుత్వమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం పట్ట ణంలోని వెంకట్‌రెడ్డి గార్డెన్‌లో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, కోరుట్ల ఎమ్మె ల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అథితిగా హా జరయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్వే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నా రని అన్నారు. రాష్ట్రంలో యువకులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యం లో సీఎం కేసీఆర్‌ యువకులకు 95 శాతం రాష్ట్రం వాళ్లకే ఉద్యోగాలు ఇ స్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వ కుంట్ల విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ఇం ట్లో మూడు పార్టీలు ఉన్నాయని, ఆయనదో పార్టీ అయితే, తండ్రిదో పార్టీ, అన్నదో పార్టీ అని విమర్శించారు. పసుపు బోర్డు తీసుకువస్తాని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మాట నిలబెట్టుకోలేకపోయిన ఘనత ఎంపీ అర్వింద్‌కే దక్కుతుందన్నారు. స్పైస్‌ బోర్డు వేరు, పసుపు బోర్డు వేరన్న సంగతీ ఎం పీకి తెలియదని ఎద్దేవా చేశారు. పిచ్చోలను టైగర్‌లుగా చేయాల్సిన అవ సరం లేదని బండి సంజయ్‌, అర్వింద్‌లు ఇద్దరు మూర్ఖులని ఇష్టం వచ్చి నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రతి పక్ష పార్టీలపై ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధర లను పెంచడంలో కేంద్రంలో మోదీసర్కార్‌ సక్సెస్‌ అయి ప్రజలపై ఆ ర్ధిక భారం పడేలా చేస్తున్నారని అన్నారు. మోదీ ప్రభుత్వంలో జీడీపీ పా తాళంలో ఉంటే ధరలు ఆకాశనంటుతున్నాయని, నిరుద్యోగం కూడ తీవ్రం గా పెరిగి పోయిందని అన్నారు. అబద్దాలకు ప్రతి రూపం ఎంపీ అర్వింద్‌ అని ఘటుగా వాఖ్యానించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఎప్పుడు సీఎం కేసీ ఆర్‌ను తిడుతారు కానీ బీజేపీని మాత్రం ఏమీ అనడం లేదని అన్నారు. జీవన్‌ రెడ్డి బీజేపీ వాళ్లతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆయ్యారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రచ్చబండ కార్యక్రమం నిర్వహించేందుకు గ్రామాలకు వస్తే వారికి టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి పనులను చూపించాలని పిలు పునిచ్చారు. బీజేపీ వాళ్లు జై శ్రీరాం అంటే మనం జై హనుమాన్‌ అనాలని పిలుపునిచ్చారు. దేవుడి పేరుతో రాజకీయం చేస్తే చూస్తు ఉరుకోం అన్నా రు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T06:00:33+05:30 IST