తెలంగాణపై విషం చిమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-07-02T06:45:26+05:30 IST

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతోం దని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. శుక్ర వారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణపై విషం చిమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం
కోదాడలో మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్‌

కోదాడ, జూలై 1: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతోం దని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. శుక్ర వారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని  119 నియో జకవర్గాల్లో  బీజేపీ టూరిస్టులు వచ్చి వెళ్లి జన సమీకరణ కోసం డబ్బులు పంచుతూ గారడీ చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడి ఎనిమిది సంవత్సరాలైన విభజన చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలుచేయలేద న్నారు. రాజ్యసభ సాక్షిగా తెలంగాణ విభజనపై వెకిలిగా  మాట్లాడిన మోదీ  రాష్ట్ర పర్యటనలో తెలంగాణాలో జరిగిన అభివృద్ధిని చూస్తార న్నారు.  తెలంగాణా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ఎంతమంది టూరిస్టులు వచ్చినా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను గెలిపించడా నికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బుర్రా సుధారాణిపుల్లారెడ్డి, ఎంపీపీ చింతా కవితారెడ్డి, టీఆర్‌ఎస్‌  పార్టీ పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, ఈదుల కృష్ణయ్య, ఇమ్రాన్‌, రహీం, సూర్యనారాయణ, తాజుద్దిన్‌, గంధం పాండు పాల్గొన్నారు. 




Updated Date - 2022-07-02T06:45:26+05:30 IST