రైతులతో నేడు కేంద్ర ప్రభుత్వ రెండో విడత చర్చలు

ABN , First Publish Date - 2020-12-03T14:39:19+05:30 IST

మంగళవారం జరిగిన చర్చల్లో వ్యవసాయ చట్టాల సమీక్షపై కమిషన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత చట్టాల్ని వెనక్కి తీసుకుంటామనే హామీ మినహా తాము ఏ ప్రతిపాదనకూ అంగీకరించేది

రైతులతో నేడు కేంద్ర ప్రభుత్వ రెండో విడత చర్చలు

న్యూఢిల్లీ: రైతులతో నేడు కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలు జరపనుంది. మంగళవారం కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, నరేంద్ర సింగ్ తోమర్‌తో రైతులు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్చల్లో ఇరు వర్గాలు భిన్న వాదనలు వినిపించాయి. చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మలి విడత చర్చలకు అవకాశం ఏర్పడింది.


మంగళవారం జరిగిన చర్చల్లో వ్యవసాయ చట్టాల సమీక్షపై కమిషన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత చట్టాల్ని వెనక్కి తీసుకుంటామనే హామీ మినహా తాము ఏ ప్రతిపాదనకూ అంగీకరించేది లేదని రైతులు తేల్చి చెప్పారు. కాగా, ఈరోజు జరిగే చర్చలపై మంగళవారం రైతులతో చర్చలు చేసిన మంత్రులతో పాటు పలువురు అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. ఈరోజు జరగాల్సిన చర్చల గురించి వారితో చర్చించారు.

Updated Date - 2020-12-03T14:39:19+05:30 IST