Breaking: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు.. సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం ఉద్ధవ్..

ABN , First Publish Date - 2022-06-28T01:08:52+05:30 IST

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం (Maharashtra Political Crisis) మరో మలుపు తిరిగింది. ఏక్‌నాథ్ షిండేకు (Eknath Shinde) మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలను..

Breaking: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు.. సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం ఉద్ధవ్..

ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం (Maharashtra Political Crisis) మరో మలుపు తిరిగింది. ఏక్‌నాథ్ షిండేకు (Eknath Shinde) మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలను మంత్రి పదవుల నుంచి తొలగిస్తున్నట్లు తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) ప్రకటించారు. దీంతో.. ఏక్‌నాథ్‌షిండే (Eknath Shinde) వర్గంలోని 8 మంది మంత్రుల శాఖలు తొలగింపు జరిగింది. ఏక్‌నాథ్‌ షిండే శాఖను సుభాష్‌ దేశాయ్‌కి కేటాయించినట్లు ఉద్ధవ్‌ తెలిపారు. ఉద్ధవ్‌ క్యాబినెట్‌లోని (Uddhav Cabinet) మరో మంత్రి ఉదయ్‌ సామంత్‌ (Uday Samanth) కూడా షిండే గూటికి చేరిన సంగతి తెలిసిందే. గువాహటికి (Gauhati) చేరిన తొమ్మిదో మంత్రి ఆయన. గులాబ్‌రావ్‌ పాటిల్‌, దాదా భూసే, సందీపన్‌ భుమ్రే, సహాయమంత్రులు శంభూరాజే దేశాయ్‌, అబ్దుల్‌ సత్తార్‌(వీరంతా శివసేన ఎమ్మెల్యేలు), బచ్చు కాడు (ప్రహార్‌ జనశక్తి పార్టీ), రాజేంద్ర యడ్రావర్కర్‌ (ఇండిపెండెంట్‌, శివసేన కోటా మంత్రి) ఇప్పటికే షిండే గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఇక.. షిండే స్వయంగా క్యాబినెట్‌ మినిస్టర్‌. దీంతో అసమ్మతి శిబిరంలో 9 మంది మంత్రులు ఉన్నట్టయింది. దీంతో ఉద్ధవ్‌ క్యాబినెట్‌లో శివసేన (Shivsena) నుంచి మంత్రిగా ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా ఆదిత్య ఠాక్రే (Aditya Thackeray) నిలిచారు.



ఇదిలా ఉండగా రెబల్ ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై మహారాష్ట్ర ప్రభుత్వానికి (Maharashtra Govt), డిప్యూటీ స్పీకర్‌ (Deputy Speaker), మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి (Maharashtra Assembly Secretary) సుప్రీం కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జులై 11కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అంతేకాదు.. జూన్ 27 సాయంత్రం 05.30 లోపు అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలకు (Rebel MLAs) డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును సుప్రీం కోర్టు (Supreme Court) జులై 12 వరకూ పొడిగించింది. దీంతో.. అనర్హత నోటీసుల విషయంలో రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్టయింది. రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ 39 మంది ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల భద్రత.. వారి ఆస్తులను కాపాడేందుకు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఉద్ధవ్ సర్కార్‌ను (Uddhav Govt) ఆదేశించింది.



ఇదిలా ఉండగా సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) నేడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (NCP Sharad Pawar) ఉద్ధవ్‌ను (Uddhav) ఆపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సుప్రీం కోర్టులో (Supreme Court) రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించడంతో ఆ క్యాంపుకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే ట్విట్టర్ (Eknath Shinde Twitter) వేదికగా స్పందించారు. ఇది బాలాసాహెబ్ ఠాక్రే (Balasaheb Thackeray) హిందుత్వ సాధించిన విజయంగా ట్వీట్ చేశారు. షిండే వర్గం త్వరలో గవర్నర్‌ను కలిసి మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నామని తెలిపే యోచన చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు.. ఉద్ధవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న శివసేన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూడా షిండే వర్గం భావిస్తోంది. దీంతో.. మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఏ క్షణాన ఏ మలుపు తీసుకోనుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Updated Date - 2022-06-28T01:08:52+05:30 IST