బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

Jun 17 2021 @ 00:07AM
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ శ్రుతి ఓఝా, ఇతర అధికారులు

- కలెక్టర్‌ శ్రుతి ఓఝా


గద్వాల, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని కలెక్టర్‌ శ్రుతి ఓఝా పిలుపునిచ్చారు. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం ఆమె పోస్టర్‌ను విడుదల చేశారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే జరిమానా, రెండేళ్లు జైలు శిక్ష ఉంటుందన్నారు. 14 నుంచి 18 లోపు సంవత్సరాల యువతులతో వెట్టి చాకిరీ చేయిస్తే ఇదే శిక్షలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో లేబర్‌ కమిషనర్‌ మహేష్‌కుమార్‌, స్త్రీ శిశు సంక్షేమాధికారి ముసాయిదాబేగం, హేమలత, నర్సింహులు, సహదేవులు, జయభారతి పాల్గొన్నారు.


Follow Us on: