క్లైమాక్స్‌ అందరినీ కదిలిస్తోంది

Published: Sun, 22 May 2022 02:29:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
క్లైమాక్స్‌ అందరినీ కదిలిస్తోంది

‘‘మలయాళంలో విడుదలైన ‘జోసెఫ్‌’ నేను చూశా. చాలా బాగా నచ్చింది. అయితే తెలుగులో ఇలాంటి కథల్ని చూస్తారా? అనే అనుమానం ఉండేది. ‘శేఖర్‌’కి వస్తున్న స్పందన చూస్తుంటే మంచి కథలు ఎక్కడైనా ఆడతాయి అనే ధైర్యం వచ్చింద’’న్నారు బీరం సుధాకర్‌ రెడ్డి. ఆయన నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘శేఖర్‌’. రాజశేఖర్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘రాజశేఖర్‌ నా అభిమాన కథానాయకుడు. ‘గరుగ వేగ’తో మా ప్రయాణం మొదలైంది. ఆ తరవాత ‘జోసెఫ్‌’ని తెలుగులో రీమేక్‌ చేద్దామనుకొన్నాం. జీవితగారిపై నమ్మకంతో దర్శకత్వ బాధ్యత కూడా ఆమెకే అప్పగించాం. ఈ కథని బాగా అర్థం చేసుకొని, చక్కగా తెరకెక్కించారు. క్లైమాక్స్‌ అందరినీ కదిలిస్తోంది. మంచి సందేశం ఇచ్చామన్న సంతృప్తి దక్కింది. నేను స్వతహాగా నిర్మాతని కాదు. నాకున్న వ్యాపారాలు చూసుకుంటూ, పరిశ్రమలోని స్నేహితుల చిత్రాలకు పెట్టుబడి పెడుతుంటాను. ఇప్పటి వరకూ దాదాపు పదిహేను చిత్రాలకు ఇన్వెస్టర్‌గా వ్యవహరించా’’ అన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International