ప్రజల దృష్టి మరల్చడానికే కేంద్రంపై సీఎం విమర్శలు

ABN , First Publish Date - 2022-05-27T06:05:25+05:30 IST

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టి మళ్లించడానికి ప్రధానమంత్రి పర్యటనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ దూరంగా ఉండండంతో పాటు విమర్శలు చేస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు.

ప్రజల దృష్టి మరల్చడానికే కేంద్రంపై సీఎం విమర్శలు
సమావేశంలో మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి

- ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి 

 - ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి 

జగిత్యాల టౌన్‌, మే 26 : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దృష్టి మళ్లించడానికి ప్రధానమంత్రి పర్యటనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ దూరంగా ఉండండంతో పాటు విమర్శలు చేస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో గురువారం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ హక్కులను కాపాడుకోలేని నాయకులు ఇప్పుడు దేశా లు పట్టుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రా న్ని కేసీఆర్‌ ప్రభ్వుత్వం అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. 2014 నుంచి 2019 వరకు ప్రధానమంత్రితో కలిసి ఉన్న కేసీఆర్‌ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు, త్రిబుల్‌ తలాక్‌, రాష్ట్రపతి ఎన్నికలు తదితర చట్టాలకు మద్దతు పలికారన్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కే అవకాశం ఉండి కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ వాదని, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ రాష్ట్రం రాకుండా కుట్రలు చేశారన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిదినాల్లో కనీసం రూ. 257 కూలీ వేతనం కల్పించాలన్నారు. వేసవికి సంబంధించి మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు 20 నుంచి 30 శాతం కూలీలకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉపాధి హామీ పనులను పర్యవేక్షించే ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించిన ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ స్వయంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి తీసుకుంటామని చెప్పారన్నారు. రెండు మాసాలు గడుస్తున్నా ఫీల్డ్‌ అసిస్టెంట్ల నియామకానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదన్నారు. ఉపాధి హామీ  పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందన్నారు. ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లు తూకం వేయడం లేదని, జిల్లా అధికారులకు, పాలనాధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు శూన్యమన్నారు. ఈ సమా వేశంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, పీసీసీ సభ్యుడు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గిరి నాగభూషణం, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ కల్లెపల్లి దుర్గయ్య, నాయకులు పుప్పాల అశోక్‌, చంద రాధకిషన్‌రావు, ధర రమేష్‌బాబు, చాంద్‌ పాష తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-05-27T06:05:25+05:30 IST