పేదల పొట్టగొడుతున్న సీఎం కుటుంబం

ABN , First Publish Date - 2022-08-14T05:40:16+05:30 IST

కేసీఆర్‌ కుటుంబం పేదల పొట్టికొట్టి రూ. లక్షల కోట్లు సంపాదించుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

పేదల పొట్టగొడుతున్న సీఎం కుటుంబం
సభలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌

వ్యాపార, విద్యావేత్తలకు రైతుబంధు అవసరమా?

 కౌలు రైతులను విస్మరించిన మూర్ఖుడు కేసీఆర్‌

 తెలంగాణలో కేసీఆర్‌ రాజ్యాంగం 

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌

మోత్కూరు, ఆగస్టు 13: కేసీఆర్‌ కుటుంబం పేదల పొట్టికొట్టి రూ. లక్షల కోట్లు సంపాదించుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.  ఆయన చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర శనివారం రాత్రి మోత్కూరు చేరుకున్న సందర్భంగా అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పాలనలో ఉప ఎన్నిక వస్తేనే నియోజకవర్గం అభివృద్ది చెందుతుందని, లేదంటే ప్రజా సమస్యల ను పట్టించుకోరని చెప్పారు. మోత్కూరు కు పెద్ద ఆస్పత్రి, డిగ్రీ కళాశాల, మహిళా కళాశాల, ఆర్టీసీ బస్‌డిపో, బునాదిగాని కాల్వ నిర్మాణం పూర్తి, డబు ల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ళు వచ్చా యా? అని ఆయన ప్రశ్నించి సభికుల చేత రాలేదని చెప్పించారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఇక్కడ కూడా ఉపఎన్నిక రావాల్సిందేనని ఎద్దేవా చేశారు. మో త్కూరు, ఆత్మకూరు(ఎం), అడ్డగూడూరు మండలాలకు సాగు నీరందించే బునాదిగాని కాల్వ నిర్మాణానికి మహా అయితే రూ.వంద కోట్లు ఖర్చవుతుండవచ్చని, రూ.1లక్ష 40వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మించి 200కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఫాం హౌ్‌సకు నీరు తీసుకెళ్లొచ్చుగాని, బునాదిగాని కాల్వ ఎందుకు పూర్తికాదని ప్రశ్నించారు. పేదోళ్లంటే ఆయనకు ప్రేమ లేదని విమర్శించారు. మోత్కూరు ము నిసిపాలిటీ అయ్యిందా ఏమైన మార్పు వచ్చిందా అని ఆయన అడగ్గా ఏం రాలేదని సభికులు చెప్పా రు. మోత్కూరు మునిసిపాలిటీగా బోర్డు మారిందే తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. తుంగతుర్తి నియోజకవర్గానికి ముగ్గురు కలెక్లర్లు, ముగ్గురు ఎస్‌పీలు, ముగ్గురు డీఆర్‌వోలతో మూడు ముక్కలాట గా మారిందన్నారు. రజాకార్లుకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డకాబట్టే శ్రీకాంత్‌చారి,వేణుగోపాల్‌రెడ్డి, పోలీ సు కిష్టయ్య తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారన్నారు.తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందన్నారు.


ఏ ఒక్కరికీ ఇల్లు ఇవ్వని కేసీఆర్‌.. 100 రూమ్‌లు కట్టుకున్నారు

పేదల కోసం ప్రధాని మోదీ 2.40లక్షల ఇళ్ళు ఇస్తే వాటికి డబుల్‌ బెడ్‌రూమ్‌ అని పేరు చెప్పి ఒక్కరికీ ఇల్లు ఇవ్వలేదని బండి సంజయ్‌ దుయ్యబట్టారు. అవి ఇస్తే ఇంకా అవసరముంటే తాను ప్రధా నితో మాట్లాడి ఇంకా ఇళ్లు మంజూరు చేయించేవాడినన్నారు. పేదలకు ఇల్లు ఇవ్వని కేసీఆర్‌ మాత్రం ఎనిమిదేళ్లలో 100రూమ్‌లు కట్టుకున్నారని ఆరోపించారు. రైతుబంధు మెడికల్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నవారికి, కాంట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు ఇస్తూ కౌలు రైతులకు ఇవ్వని మూర్ఖుడు కేసీఆర్‌ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.  


యాత్ర సాగిందిలా

బీజేపీ ప్రజా సంగ్రామయాత్ర 11వ రోజు శనివా రం ఉదయం 11 గంటలకు నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు శివారు నుంచి మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలోకి ప్రవేశించింది. పొడిచేడు, అనాజిపురం, బుజిలాపురం, ధర్మాపురం మీదుగా మోత్కూరు చేరుకుంది. పొడిచేడులో తెలంగాణ మ లి ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంత్‌చారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. అనాజిపురంలో పత్తి రైతు యాదగిరి వద్దకు వెళ్లి ట్రాక్టర్‌ నడిపారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వీఆర్‌ఏలు తమ సమస్యలపై ఆయనకు వినతి పత్రం అందజేశారు.


బినామీల పేర 400 ఎకరాలు 

తెలంగాణలో కేసీఆర్‌ రాజ్యాంగం నడుస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రా వు విమర్శించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌ మూసీ, బిక్కేరుల్లో ఇసుక లేకుండా ఖాళీ చే శారన్నారు. ఆయన ఒక్క రోజు ఆదాయం రూ. రెండు కోట్లని సోషల్‌మీడియా చెబుతోందన్నారు. ఎమ్మెల్యే తిరుమలగిరి తదితర మండలాల్లో 400 ఎకరాల భూమి బినామీల పేరున కొన్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రె్‌సకు పూర్తి పక్షవా తం వచ్చిందని,రేవంత్‌రెడ్డి కాదు కదా అతని మ నుమడు కూడా కాంగ్రె్‌సను అధికారంలోకి తేలేర ని ఆయన విమర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి కడియం రామచంద్రయ్య, యాత్ర ప్రముఖ్‌ గంగిడి మనోహర్‌రెడ్డి, దాసరి మల్లేషం, మాజీ ఎంపీపీ దీటి సంధ్యారాణి, కొణతం నాగార్జునరెడ్డి, బొట్టు అబ్బయ్య, గౌరు శ్రీనివాస్‌, బయ్యని రాజు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు మండలం ఖప్రాయపల్లి గ్రామానికి చెందిన రిటైర్డు ఏసీపీ బొట్టు కృష్ణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని సమక్షంలో బీజేపీలో చేరారు. 

Updated Date - 2022-08-14T05:40:16+05:30 IST