సీఎం హామీలను నెరవేర్చాలి

ABN , First Publish Date - 2021-07-24T05:04:05+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఫ్యాప్టో కన్వీనర్‌ జవహర్‌నాయక్‌, కో కన్వీనర్లు రామకృష్ణ, కిశోర్‌, బాలాజీరావు, శంకర్‌, వెంకటేశ్వర్లు, వెంకటరత్నం, జాకీర్‌హుసేన్‌ అన్నారు.

సీఎం హామీలను నెరవేర్చాలి
తహసీల్దార్‌ ప్రకాష్‌బాబుకు వినతిపత్రం ఇస్తున్న ఫ్యాప్టో నాయకులు

 తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఫ్యాప్టో నిరసన

 ఆత్మకూరు, జూలై 23:
ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఫ్యాప్టో కన్వీనర్‌ జవహర్‌నాయక్‌, కో కన్వీనర్లు రామకృష్ణ, కిశోర్‌, బాలాజీరావు, శంకర్‌, వెంకటేశ్వర్లు, వెంకటరత్నం, జాకీర్‌హుసేన్‌ అన్నారు. శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేర కు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట  ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో సీఎం జగన్‌ విఫలయ్యారని అన్నారు. 2018 జూలై నుంచి ఇవ్వాల్సిన 11వ పీఆర్‌సీకి ఇంతవరకు దిక్కులేదని, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నా బకాయి ఉన్న డీఏలను మంజూరు చేయలేదని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్ర సమయంలో అధికారంలోకి వచ్చిన వారంలోపే సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పి నేడు పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. ప్రతి నెలా ఒకటోవ తేదీన ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని, పదవీ విరమణ, మరణించిన ఉద్యోగులకు పెన్షన్‌ సౌకర్యాలను వెంటనే అమలు చేయాలని అన్నారు.

 జాతీయ విద్యావిధానంలోని లోపాలను సవరించాలని, ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు పదోన్నతులు చేపట్టాలని, ఏపీజీఎల్‌ఐపీఎఫ్‌ రుణాలను సకాలంలో చెల్లించాలని, ఖాళీగా ఉన్న 25వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ ప్రకా్‌షబాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు అమీర్‌, రామ్‌బాలాజీనాయక్‌, నాగస్వామినాయక్‌, రఫీక్‌, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు షుకూర్‌, ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు జహీర్‌, పుల్లన్న, దాసు పాల్గొన్నారు.


బనగానపల్లె: సీపీఎ్‌సను వెంటనే రద్దు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు, బనగానపల్లె ఫ్యాప్టో అధ్యక్షుడు మాధవస్వామి శుక్రవారం డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరికి నిరసనగా తహసీల్దారు కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్‌, యూటీఎఫ్‌, ఎస్టీయూ, ఎన్‌జీవో సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్యాప్టో ఽఅధ్యక్షుడు మాధవస్వామి, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి సత్యప్రకాశ్‌, ఎస్‌టీయూ జిల్లా కార్యదర్శి ఓబుళరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే మంజూరు చేయాలని, సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, నూతన విద్యావిధానంలో ప్రాథమిక స్థాయి వరకు ఒకే పాఠశాలల్లో విద్యార్థులు చదువుకునేలా ఏర్పాటు చేయాలని, కొవిడ్‌తో మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు  వెంకటేశ్వర్లు, అరీఫ్‌,  హరినాథ్‌గౌడ్‌, ప్రతాప్‌, శ్రీనివాసరెడ్డి, లింగమయ్య, హబీబుల్లా, మద్దిలేటి, దస్తగిరి, నాగరాజు, విజయబాస్కర్‌, సుంకన్న, వెంకటేశ్వర్లు, వెంకటకృష్ణ, అనిల్‌కుమార్‌, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T05:04:05+05:30 IST