స్విమ్మర్‌ను కాపాడిన కోచ్
ABN , First Publish Date - 2022-06-24T09:21:53+05:30 IST
అమెరికా స్విమ్మింగ్ జట్టు కోచ్ ఆండ్రియా ఫ్యుంటెస్ సత్వర స్పందన ఓ స్విమ్మర్ ప్రాణాలు కాపాడింది.
బుడాపెస్ట్ (హంగేరి) : అమెరికా స్విమ్మింగ్ జట్టు కోచ్ ఆండ్రియా ఫ్యుంటెస్ సత్వర స్పందన ఓ స్విమ్మర్ ప్రాణాలు కాపాడింది. వరల్డ్ స్విమ్మింగ్ చాంపియన్‌షి్‌ప సందర్భంగా జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోటీలలో భాగంగా సోలో ఫ్రీ రొటీన్లో జంప్ చేసిన 25 ఏళ్ల అమెరికా ఆర్టిస్టిక్ స్విమ్మర్ అనిత అల్వరేజ్ అనూహ్యంగా స్పృహతప్పి మునిగిపోసాగింది. అది గమనించిన కోచ్ ఆండ్రియా వెంటనే పూల్‌లో దూకి ఆమె వద్దకు చేరి..తన చేతులను అనిత చుట్టూ వేసి బయటకు తీసుకొచ్చింది. వెంటనే వైద్య బృందం వచ్చి అల్వరేజ్కు చికిత్స చేయడంతో ఆమె కోలుకుంది.