చలి చంపేస్తోంది

ABN , First Publish Date - 2022-01-29T06:32:34+05:30 IST

వాతావరణంలో వచ్చిన మార్పులతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. యా దాద్రి జిల్లా రాజాపేట మండలంలో శుక్రవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 10డిగ్రీలుగా నమోదైంది.

చలి చంపేస్తోంది

రాజాపేటలో కనిష్ఠ ఉష్ణోగ్రత 10డిగ్రీలుగా నమోదు

వాతావరణంలో మార్పుతో రోగాలబారిన ప్రజలు


యాదాద్రి, జనవరి 28(ఆంధ్రజ్యోతి)/దేవరకొండ: వాతావరణంలో వచ్చిన మార్పులతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. యా దాద్రి జిల్లా రాజాపేట మండలంలో శుక్రవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 10డిగ్రీలుగా నమోదైంది. వలిగొండ, చౌటుప్పల్‌ మండలాల్లో 11 డిగ్రీలు, మోత్కురు, తుర్కపల్లి, భువనగిరి రామన్నపేట, ఆలేరు, బొమ్మలరామారం, పోచంపల్లి, బీబీనగ ర్‌, గుండాల, ఆత్మకూరు, తదితర మండలాల్లో 12 నుంచి 14 డిగ్రీల వరకు నమోదవుతోంది. నల్లగొండ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీలుగా నమోదైంది. మూడు రోజులుగా వాతావరణం చల్లబడి, చల్లని గాలులు వీస్తున్నాయి. చలికి వృద్ధులు గజగజ వణికిపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్ల నుంచి బయటికి వచ్చే సాహసం చేయడంలేదు. పాలు, కూరగాయాలను తీసుకొచ్చే రైతులు, వ్యాపారులు ఉదయాన్నే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చేందుకు, యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు చలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి కారణంగా ప్రజలు జలుబు, జ్వరాల వంటి రోగాలబారిన పడుతున్నారు. చలి నుంచి రక్షణ పొం దేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండటంతో జలుబు, జర్వం ఉంటే ప్రజలు భయభ్రాంతులకు గురై పరీక్షల కోసం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.

Updated Date - 2022-01-29T06:32:34+05:30 IST