అదనపు విద్యుత్‌చార్జీల వసూళ్లను నిలిపివేయాలి

May 9 2021 @ 00:44AM
ట్రాన్స్‌కో కార్యాలయంలో వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

భైంసా, మే 8 : కరోనాతో కష్టనష్టాలను ఎదుర్కొంటున్న విద్యుత్‌ వినియోగ దారులపై అదనపు ఛార్జీల వసూళ్లను వెంటనే నిలిపివేయాలని ముథోల్‌ నియో జకవర్గ కాంగ్రెస్‌పార్టీ ట్రాన్స్‌కో అధికారులకు విజ్ఙప్తి చేసింది. ఈ మేరకు శని వారం కాంగ్రెస్‌ పార్టీ భైంసా అధ్యక్షుడు వడ్నపు శ్రీనివాస్‌, ముథోల్‌ నియో జకవర్గ యూత్‌ అధ్యక్షులు సాయినాథ్‌, కుంటాల మండల అధ్యక్షులు ప్రశాంత్‌, ఎన్‌ఎస్‌యూఐ ప్రతినిధి షేక్‌అంజాద్‌, బి.సుదర్శన్‌లు భైంసా ట్రాన్స్‌కో కార్యా లయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రతి నిధులు మాట్లాడుతూ అదనపు చార్జీలమోతతో వినియోగదారులు బెంబేలెత్తి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజ్‌మెంట్‌ చార్జీలు, డెవలప్‌మెంట్‌ ఛార్జీలు, మెయింటెనెన్స్‌ ఛార్జీల పేరిట అదనపు చార్జీలను బాదడాన్ని వెంటనే నిలిపి వేయాలన్నారు. కరోనాతో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్న విపత్కర పరిస్థితుల్లో చార్జీలమోత మోగించడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నించారు. ట్రాన్స్‌కో అధికారులు సంబంధిత విషయంలో స్పందించి అదనపు చార్జీల వసూళ్లను నిలిపి వేయాలన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వెల్లడించారు.


Follow Us on: