రైతులకు అండగా కాంగ్రెస్‌ రచ్చబండ

ABN , First Publish Date - 2022-05-22T05:33:53+05:30 IST

వరంగల్‌లో రాహుల్‌గాంధీ సభ తర్వాత కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల్లో ఊపువచ్చింది. అందుకు అనుగుణంగా పీసీసీ సైతం వరుస కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో రాష్ట్రంలో కాంగ్రె్‌సకు బలంగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేతలు జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలుగా బరిలో ఉండాలని బలంగా భావిస్తున్న నేతలు ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని అవకాశం గా తీసుకుని నెల రోజుల షెడ్యూల్‌ను ఖరా రు చేసుకున్నారు.

రైతులకు అండగా కాంగ్రెస్‌ రచ్చబండ
పోచంపల్లి మండల రేవనపల్లిలో మాట్లాడుతున్న అనిల్‌కుమార్‌రెడ్డి

నెల రోజుల పాటు నేతల పర్యటనలు

నల్లగొండపై కోమటిరెడ్డి నజర్‌

రేపు అట్టహాసంగా క్యాంపు కార్యాలయం ప్రారంభం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): వరంగల్‌లో రాహుల్‌గాంధీ సభ తర్వాత కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల్లో ఊపువచ్చింది. అందుకు అనుగుణంగా పీసీసీ సైతం వరుస కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో రాష్ట్రంలో కాంగ్రె్‌సకు బలంగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేతలు జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలుగా బరిలో ఉండాలని బలంగా భావిస్తున్న నేతలు ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని అవకాశం గా తీసుకుని నెల రోజుల షెడ్యూల్‌ను ఖరా రు చేసుకున్నారు. ఆ సమాచారాన్ని నియోజక వర్గాల్లోని నేతలకు చేరవేసి అందుబాటులో ఉండబోతున్నామనే సంకేతాలు పం పారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతలు ఎవరికి వారు ఉత్సాహం కనబరుస్తుండగా, నియోజకవర్గాల్లో రచ్చబండ  విజయవంతానికి పీసీసీ నుంచి పరిశీలకులు సైతం హజరుకానున్నారు.



పీసీసీ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలో తొలి రోజు శనివారం ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని సీనియర్‌ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పల్లెల్లోకి వెళ్లారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదే ఈ రచ్చబండ లక్ష్యం. దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి రోజున కార్యక్రమాన్ని ప్రారంభించి జూన్‌ 21వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది పరిశీలకులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు పీసీసీ ప్రణాళికలు రూపొందించింది. ప్రతీ పరిశీలకుడు 30 నుంచి 40 గ్రామాల్లో రైతు డిక్లరేషన్‌ గురించి ప్రచారం చేయనున్నారు. రూ.2లక్షల రుణమాఫీ, రూ.15వేల రైతుబంధు, పోడు భూములపై గిరిజనులకు హక్కులు, పసుపు బోర్డు ఏర్పాట్లు, వరికి రూ.2,500 మద్దతు ధరతో పా టు ప్రధాన పంటలకు మద్దతు ధరలు, ధరణి పోర్టల్‌ రద్దు, ఉపాధి హామీ పథకంతో వ్యవసాయం అనుసంధానం సహా వివిధ అంశాలతో కూడిన వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను ప్రజలకు వివరించనున్నారు. దీనికి సంబంధించి పీసీసీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలు ఇప్పటికే నియోజకవర్గ నేతలకు చేరాయి. వీటికి తోడు స్థానిక నేతలు తమకు ప్రయోజనం చేకూరేలా అదనంగా కరపత్రాలు, ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.


తొలి రోజు విజయవంతంగా..

నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని చింతలపా లెం మండలం దొండపాడులో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పెన్‌పహాడ్‌ మండలం దూపహాడ్‌ గ్రామంలో కార్యక్రమా న్ని నిర్వహించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మా జీ ఎమ్మెల్యే బాలూనాయక్‌ పీఏపల్లి మండలంలోని మాదాపురం గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదాద్రి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పోచంపల్లి మండలంలో నిర్వహించారు. చింతలపాలెం మండలం కృష్ణాపురం ఎంపీటీసీ షెక్‌బాజీ టీఆర్‌ఎస్‌ పార్టీకి రా జీనామా చేసి రచ్చబండ మొదటి రోజే కాంగ్రెస్‌ కం డువా కప్పుకున్నారు. నెల రోజుల్లో 250 గ్రామాలు, మూడు మునిసిపాలిటీల్లో రచ్చబండ నిర్వహించేందుకు ఎంపీ ఉత్తమ్‌ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేశారు. రచ్చబండ పేరుతో గ్రామాల్లోకి వెళితే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకోవడం, వలసల ను నివారిస్తూ అధికార టీఆర్‌ఎ్‌సలో అసంతృప్తులు గా ఉన్న వారికి కాంగ్రెస్‌ కండువా కప్పడం, స్థానిక టీఆర్‌ఎస్‌ నేతల పనితీరును ఎండగట్టేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పార్టీకి చెందిన సీనియర్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.


నల్లగొండపై కోమటిరెడ్డి నజర్‌

వరుసగా నాలుగుసార్లు నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, వైఎస్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సీనియర్లంతా ఎంపీలుగా పోటీ చేయాల్సిందేనని కాంగ్రెస్‌ అధిష్ఠానం పట్టుపట్టడంతో 2019 ఎన్నికల్లో వెంకట్‌రెడ్డి భువనగిరి పార్లమెంట్‌ సభ్యుడిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఎంపీగా గెలిచినప్పటికీ ఆయన మనసంతా నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది. రాను న్న ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగానే బరిలో దిగేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు ఉత్తమ్‌, కోమటిరెడ్డి సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉంటానని ఎంపీ ఉత్తమ్‌ ఇప్పటికే అధికారికంగా ప్రకటించగా, ఎంపీ కోమటిరెడ్డి మాత్రం పరోక్షంగా ప్రకటిస్తున్నారు. నల్లగొండను వదిలేది లేదంటూ గతంలో ప్రకటించారు. ఎంపీ హోదాలో నా ర్కట్‌పల్లి వరకు వస్తున్న తాను నల్లగొండ రాలేక కాదని, ఇప్పటి నుంచే బరిలోకి దిగితే టీఆర్‌ఎస్‌ నుంచి ఎదురయ్యే పరిణామాలు, వాటి మూలంగా అనవసర ప్రయాసలు ఎందుకని, ఈ ఏడాది చివరి నుంచి నల్లగొండలో పూర్తిగా అందుబాటులో ఉంటానని, స్థానిక పరిస్థితులు సైతం పూర్తిగా అనుకూలంగా ఉన్నాయంటూ సమీప అనుచరులతో వెంకట్‌రెడ్డి ఇంతకాలం చెబుతూ వస్తున్నారు. కాగా, ఎన్నికలు సమీపిస్తుండటంతో తన పుట్టినరోజు వేడుకను వేదికగా చేసుకుని నల్లగొండ నుంచి బరిలో ఉంటాననే అంశాన్ని బలంగా చెప్పేందుకు వెంకట్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 23న నల్లగొండ పట్టణంలో వెంకట్‌రెడ్డి నూతన క్యాంపు కార్యాలయం ప్రారంభ ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం పేరుతో నియోజకవర్గానికి చెందిన 10వేల మంది కార్యకర్తలకు పట్టణంలోని నాలుగు ప్రాంతాల్లో భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రతీ చోటుకు వెంకట్‌రెడ్డి వెళ్లి నాయకులతో మమేకం కానున్నారు. నల్లగొండ నుంచి బరిలో దిగాలని కార్యకర్తలు కోరుతున్నట్లు వాతావరణం ఏర్పడేలా వెంకట్‌రెడ్డి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వెంకట్‌రెడ్డి సైతం ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. టీఆర్‌ఎ్‌సలో అసంతృప్త నేతలు ఇప్పటికే ఆయన టచ్‌లో ఉన్నారు. అయితే అధికార పార్టీ నుంచి చేరికలు, వారితో సంప్రదింపులు కార్యక్రమాన్ని తెర చాటుగానే చేయాలని, ఎన్నికల ముందే చేరికలు పెట్టుకోవాలని, అప్పటి వరకు స్థానికంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ నేతలకు అం దుబాటులో ఉండాలని వెంకట్‌రెడ్డి ప్రణాళిక రూపొందించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు అన్ని సౌకర్యాలతో కూడిన క్యాంపు కార్యాలయాన్ని నల్లగొండలో ఈనెల 23న వెంకట్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

Updated Date - 2022-05-22T05:33:53+05:30 IST