కళాభవన్‌ నిర్మాణం చేపట్టాలి

ABN , First Publish Date - 2021-08-03T05:48:41+05:30 IST

కళాభవన్‌ను నిర్మించాలని కోరుతూ సోమవారం కళా సంఘాల సమాఖ్య సభ్యులు రోడ్లు భవనాల శాఖ డీఈ జాఫరొద్దీన్‌కు వినతిపత్రా న్ని అందజేశారు.

కళాభవన్‌ నిర్మాణం చేపట్టాలి
డీఈకి వినతిపత్రం ఇస్తున్న కళాసంఘాల సమాఖ్య సభ్యులు

కోల్‌సిటీటౌన్‌, ఆగస్టు 2: కళాభవన్‌ను నిర్మించాలని కోరుతూ సోమవారం కళా సంఘాల సమాఖ్య సభ్యులు రోడ్లు భవనాల శాఖ డీఈ జాఫరొద్దీన్‌కు వినతిపత్రా న్ని అందజేశారు. గత పాలకవర్గ సమయంలో కళాభవన్‌ నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు అయ్యాయని, పనులు అప్పగించిన కాంట్రాక్టర్‌ మరణించడంతో నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదని తెలిపారు. మూడేళ్ళుగా కళాభవన్‌ టెండర్‌ బడ్జె ట్‌ మారుతున్నదని, ఎలక్ట్రికల్‌ బడ్జెట్‌  కొటేషన్‌ క్లియరెన్స్‌ రాగానే టెండర్‌కు అనుమ తులు వస్తాయని డీఈ కళా సంఘాల సభ్యులకు తెలిపారు. వీలైనంత త్వరగా కళా భవన్‌ నిర్మాణం పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సమా ఖ్య అధ్యక్షుడు కనకం రమణయ్య, ప్రధానకార్యదర్శి మాదరి శ్రీనివాస్‌, కళాకారులు శ్రీనివాస్‌, రాజబాబులు ఉన్నారు.

Updated Date - 2021-08-03T05:48:41+05:30 IST